Sunil Gavaskar On Pandya Pant: మరికొన్నిరోజుల్లో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌లు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తే విధ్వంసం సృష్టించి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తారని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ద్వయం ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగితే చివరి ఆరు ఓవర్లలో టీమ్‌ఇండియా దాదాపు 120 పరుగులు చేయగలదని గావస్కర్ ధీమా వ్యక్తం చేశారు.
''బహుశా రిషభ్ పంత్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నా. టీమ్‌ఇండియా తరఫున 5,6 స్థానాల్లో హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్‌లను ఒక్కసారి ఊహించుకోండి. 14-20 ఓవర్ల మధ్య ఈ జోడీ విధ్వంసం సృష్టిస్తుంది. చివరి ఆరు ఓవర్లలో ఈ ఇద్దరి నుంచి 100-120 పరుగులను కూడా ఆశించవచ్చు. ఈ పరుగులు రాబట్టే సత్తా వారికి ఉంది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యలు 5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కోసం నిజంగా నేను ఎదురు చూస్తున్నాను.'' అని గావస్కర్ అన్నారు.
గత కొంత కాలంగా ఫిట్‌నెస్, ఫామ్ కోల్పోయి టీమ్‌ఇండియాకు దూరమైన హార్దిక్ పాండ్య ఐపీఎల్లో అదరగొట్టాడు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ 487 పరుగులు చేసి జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. దిల్లీ వేదికగా జూన్ 9న తొలి టీ20 జరగనుంది.
ఇవీ చూడండి: లవ్‌స్టోరీ సక్సెస్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు 'మహిళా క్రికెటర్లు'
'టీ-20 సిరీస్‌లు అసలే వద్దు.. వాటినెవరు గుర్తుపెట్టుకుంటారు'