టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్. లోవర్ మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య ఉత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డాడు. భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఈటీవీ-భారత్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఆర్నాల్డ్.
బౌలింగ్ పరంగా కాకపోయినా బ్యాట్స్‌మన్‌గా అయినా పాండ్యను జట్టులో ఉంచుకోవడం అవసరమని ఆర్నాల్డ్ తెలిపాడు.
-
Had a lovely and intense first session with the boys in blue 🇮🇳
— hardik pandya (@hardikpandya7) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Looking forward to the matches. pic.twitter.com/F7HUOJQ8mw
">Had a lovely and intense first session with the boys in blue 🇮🇳
— hardik pandya (@hardikpandya7) July 2, 2021
Looking forward to the matches. pic.twitter.com/F7HUOJQ8mwHad a lovely and intense first session with the boys in blue 🇮🇳
— hardik pandya (@hardikpandya7) July 2, 2021
Looking forward to the matches. pic.twitter.com/F7HUOJQ8mw
సర్జరీ అనంతరం 2019లో జట్టులోకి తిరిగొచ్చిన పాండ్య.. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ విషయంలో భారత్ సతమతమవుతోంది.
"హార్దిక్ పాండ్య బ్యాట్‌తో అద్భుతంగా రాణించగలడు. చివరి ఓవర్లో వచ్చినా ఆటను వేరే లెవల్‌కు తీసుకెళ్లగలడు. శిఖర్ ధావన్, హార్దిక్.. జట్టు కోసం ముందుండి రాణిస్తారు. పృథ్వీ షా కూడా మెరుగ్గా ఆడగలడని నా అభిప్రాయం."
--రసెల్ ఆర్నాల్డ్, శ్రీలంక మాజీ క్రికెటర్.
భారత జట్టుతో తలపడం అంత సులభమేం కాదని చెప్పాడు రసెల్. అయితే.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగడం ముఖ్యమని అన్నాడు. శ్రీలంక జట్టులో అవిష్క ఫెర్నాండో టాప్ ఆర్డర్లో ఉత్తమ ప్రదర్శన చేస్తాడని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:Hardik pandya: ప్రపంచకప్‌లో కచ్చితంగా బౌలింగ్ చేస్తా!