టీ20 ప్రపంచకప్ సూపర్-12(T20 world cup 2021) దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే ముగిసింది కానీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ ట్విట్టర్(Harbhajan Singh vs Mohammad Amir) వేదికగా పరస్పరం ట్వీట్ల దాడి చేసుకున్నారు. దుబాయ్ వేదికగా గత ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల(IND vs PAK) మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ పోటీల్లో దాయాది దేశం తొలి విజయాన్ని సాధించి గత రికార్డును చెరిపేసింది.
ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమిర్ పాత వీడియోను ట్విట్టర్‌లో(Mohammad Amir twitter ) షేర్ చేశాడు. అందులో హర్భజన్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది వరుసగా సిక్సర్లు బాదినట్లు ఉంది. దీంతో భజ్జీ.. 2010 ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమిర్ వేసిన 'నో బాల్' క్లిప్పింగ్‌ను పోస్ట్(harbhajan singh twitter) చేశాడు.
-
For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021
దానికి "ప్రజలు నిన్ను చూసేది డబ్బు కోసం పాకులాడేవాడిగానే. గౌరవం, అభిమానం ఏమీ లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. మీ దేశ ప్రజలు మద్దతుదారులకు ఎంత లభించిందో మీరు చెప్పరు. క్రికెట్‌ను ఈ విధంగా అవమానించి.. ప్రజలను ఫూల్స్ చేసిన నీలాంటివారితో మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది" ట్వీట్ పెట్టాడు.
-
Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021
దానితోపాటు మహమ్మద్ అమిర్ బౌలింగ్‌లో భజ్జీ సిక్సర్ బాది టీమిండియాను గెలిపించిన వీడియోను పోస్టు చేసి "ఫిక్సర్‌కి సిక్సర్.. ఇక పద పోదాం" అన్నట్లుగా క్యాప్షన్ ఇచ్చాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే అప్పటి పాక్ ఆటగాళ్లైన మహమ్మద్ అమిర్‌తోపాటు మహమ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. అమిర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు 2016లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవకాశం కల్పించింది. అయితే 29 ఏళ్ల వయసులోనే గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు అమిర్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఇదీ చూడండి: Waqar Younis comment: 'అలా మాట్లాడి ఉండకూడదు- క్షమించండి'