ETV Bharat / sports

Harbhaja Retirement: ఆ ఘనత సాధించిన తొలి ఆఫ్ స్పిన్నర్ భజ్జీ!

Harbhaja Retirement: తన స్పిన్ మాయాజాలంతో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. సుదీర్ఘ కాలం భారత్​ స్పిన్ విభాగానికి సేవలందించిన భజ్జీ.. ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం.

Harbhajan Singh retirement, Harbhajan Singh career, హర్భజన్ సింగ్ రిటైర్మెంట్, హర్భజన్ సింగ్ కెరీర్
Harbhajan Singh
author img

By

Published : Dec 24, 2021, 3:56 PM IST

Harbhaja Retirement: టీమ్ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ శుక్రవారం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 23 ఏళ్ల పాటు తన స్పిన్ మాయాజాలంతో కోట్లాది మంది అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన భజ్జీ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. 1998లో ఆస్ట్రేలియాపై టెస్టు​ అరంగేట్రం చేసిన ఈ పంజాబ్​ బౌలర్​.. అదే ఏడాది కివీస్​పై వన్డేల్లోకి అడుగుపెట్టాడు.

విభిన్న శైలి

హర్భజన్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అతడి బౌలింగ్ శైలి. పాము మెలికలు తిరుగుతున్నట్లు తన చేతిని, శరీరాన్ని కదుపుతూ అతడు వేసే బంతుల్ని ప్రత్యర్థి బ్యాటర్లు అంచనా వేయడం అంత సులువు కాదు. తన బౌలింగ్​తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భజ్జీ.

  • All good things come to an end and today as I bid adieu to the game that has given me everything in life, I would like to thank everyone who made this 23-year-long journey beautiful and memorable.
    My heartfelt thank you 🙏 Grateful .https://t.co/iD6WHU46MU

    — Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంబరాల్లో ముందుంటాడు

మన బౌలర్ ప్రత్యర్థి బ్యాటర్ వికెట్ తీస్తే.. లేదా మన బ్యాటర్ మైదానంలో మెరుపులు మెరిపిస్తుంటే ముందుగా సంబరపడే ఆటగాళ్లలో హర్భజన్ ఒకరు. ఫీల్డింగ్​లో అయితే చెప్పనక్కర్లేదు. వికెట్ పడగానే.. తన ముఖంలో కనపడే ఆనందం టీవీల్లో మ్యాచ్ చూస్తున్న వీక్షకుల ముఖాలను తాకుతుంది. ఆ సంబరాలు ప్రేక్షకులను ఎంటర్​నైట్ చేస్తూనే, స్ఫూర్తిని రగిలిస్తాయి.

ఎన్నో ఘనతలు

భజ్జీ తన కెరీర్​లో 103 టెస్టు​లతో పాటు 236 వన్డేలు, 28 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 417 వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్​.. 50 ఓవర్ల ఫార్మాట్​లో 269 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ఇండియా తరఫున అనిల్​ కుంబ్లే తర్వాత అత్యంత విజయవంతమైన స్పిన్నర్ భజ్జీనే కావడం విశేషం. అలాగే 2007 టీ20 ప్రపంచకప్​తో పాటు 2011 వన్డే వరల్డ్​కప్​ను గెలిచిన భారత జట్టులో హర్భజన్ సభ్యుడు. నాలుగు సార్లు ఐపీఎల్​ గెలిచిన ముంబయి ఇండియన్స్​ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు.

ఈడెన్ హీరో భజ్జీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2001లో ఆసీస్​తో జరిగిన టెస్టు​ మ్యాచ్​ను క్రికెట్ అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ మ్యాచ్​లో భారీ డబుల్​ సెంచరీతో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్​ ఆడిన లక్ష్మణ్​ తర్వాత మరో హీరో భజ్జీనే. ఈ టెస్టులో హ్యాట్రిక్​తో మెరిసిన ఈ వెటరన్ స్పిన్నర్.. సుదీర్ఘ ఫార్మాట్​లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్​గా నిలిచాడు. మొత్తంగా ఈ సిరీస్​లో 32 వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్​ల సిరీస్​లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు భజ్జీ పేరిటే ఉంది.

రికార్డుల రారాజు

Harbhaja Retirement records: టీ20 ఫార్మాట్​ అంటేనే బ్యాటర్లకు పండగ. అలాంటిది ఓ మ్యాచ్​లో ఎక్కువ మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్​గా భజ్జీ సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. 2012 పొట్టి ప్రపంచకప్​లో భాగంగా జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు​.. ఇంగ్లాండ్​తో జరిగిన లీగ్​మ్యాచ్​లో రికార్డు సృష్టించాడు. రెండు ఓవర్లు మెయిడెన్​గా వేశాడు. మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 12 పరుగులే ఇచ్చి.. 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్ 80 పరుగులకే కుప్పకూలింది. తర్వాతి రోజుల్లో భువనేశ్వర్​, బుమ్రా.. భజ్జీ సరసన చేరారు.

ఇవీ చూడండి: 'ఆ విషయంలో ఐపీఎల్​కు థ్యాంక్స్ చెప్పుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.