ETV Bharat / sports

'క్రెడిట్​ మొత్తం ధోనీకేనా.. మిగతా ప్లేయర్స్​​ లస్సీ తాగేందుకు వెళ్లారా?'

author img

By

Published : Apr 13, 2022, 1:59 PM IST

Harbhajan Singh 2011 world cup: టీమిండియా 2011 ప్రపంచకప్ గెలవటంపై క్రెడిట్..​ అప్పటి కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీకి కట్టబెట్టటం సరికాదని అంటూ అసహనం వ్యక్తం చేశాడు మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​. ఐపీఎల్​ 2022లో భాగంగా ఓ స్పోర్ట్స్​ ఛానల్​ డిబేట్​లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రెడిట్​ మొత్తం ధోనీదేనా? మిగతా వారు ఏం చేయలేదా? అంటూ ప్రశ్నించాడు.

Harbhajan Singh
హర్భజన్​ సింగ్

Harbhajan Singh 2011 world cup: టీమిండియా మేటి స్పిన్నర్లలో హర్భజన్​ సింగ్​ ఒకడు. సుమారు రెండు దశాబ్దాల పాటు మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనతో తనదైన ముద్ర వేశాడు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్​లో తన ఆఫ్​స్పిన్​ మాయాజాలంతో తన వంతు పాత్ర పోషించాడు. 1983 తర్వాత ధోనీ సారథ్యంలోనే 2011లో ప్రపంచకప్​ గెలిచింది టీమిండియా. ఫైనల్​లో 91 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందిం​చిన ధోనీపై ప్రశంసలు జల్లు కురిసింది. ముఖ్యంగా చివరి సిక్స్​ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరోవైపు.. గౌతమ్​ గంభీర్​ అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. 31 పరుగులకే రెండు వికెట్లు పడిన స్థితిలో ధోనీతో కలిసి ఇన్నింగ్స్​ను నిర్మించాడు. 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే.. చాలా మంది భారత్​ ప్రపంచ కప్​ గెలవటంపై క్రెడిట్​ ధోనీకే ఇస్తూ ప్రశంసించారు. ఇలా ధోనీకి క్రెడిట్​ ఇచ్చే వారికి టీమిండియా మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ చురకలు అంటించాడు. క్రెడిట్​ మొత్తం ధోనీదేనా?.. మిగతా 10 మంది లస్సీ తాగేందుకు వచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్​ 2022లో రెండ్రోజుల క్రితం దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య జరిగిన మ్యాచ్​పై ఓ స్పోర్ట్స్​ ఛానల్​ లో విశ్లేషణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు హర్భజన్​. జట్టు మొత్తం కలిసి ఆడితేనే విజయం సాధ్యమైందని స్పష్టం చేశాడు. ఈ సందర్భంలో మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్​ పఠాన్​, మహమ్మద్​ కైఫ్​లు అక్కడే ఉన్నారు.

" ఆస్ట్రేలియా ప్రపంచ కప్​ గెలిస్తే ప్రతి ఒక్కరు ఆస్ట్రేలియా గెలిచింది అంటారు. భారత్​ వరల్డ్ కప్​ గెలిస్తే ప్రతిఒక్కరు ఎంఎస్​ ధోనీ ప్రపంచ కప్​ గెలిచాడని చెబుతున్నారు. అయితే.. మిగతా 10 మంది లస్సీ తాగేందుకు వెళ్లారా? మిగిలిన 10 మంది ఏం చేశారు? గౌతమ్​ గంభీర్​ ఏం చేశాడు? ఇతరులు ఏం చేశారు? ఇది జట్టు ఆట. 7-8 మంది ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తేనే టీమ్​ ముందుకు వెళ్తుంది."

- హర్భజన్​ సింగ్​, టీమిండియా మాజీ స్పిన్నర్​.

గంభీర్ అసహనం: సామాజిక మాధ్యమాల్లో ఎంఎస్​ ధోనీ సిక్సర్​ను సూచిస్తున్న పోస్ట్​పై రెండేళ్ల క్రితం 2020, ఏప్రిల్​ 2న స్పందించాడు గౌతమ్​ గంభీర్​. 2011 ప్రపంచ కప్​ను దేశం మొత్తం, టీమిండియా, సిబ్బంది అంతా కలిసి గెలుచుకున్నారు అని పేర్కొన్నాడు. వరల్డ్​ కఫ్​ ఫైనల్లో ధోనీ కంటే మిన్నగా తాను బ్యాటింగ్​ చేశానని గంభీర్​ పలు సందర్భాల్లో చెప్పాడు. ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజయం క్రెడిట్‌ మొత్తాన్ని ధోనీకి కట్టబెడుతూ.. తన పాత్రను తక్కువ చేసి చూపడం పట్ల గంభీర్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు.

ఇదీ చూడండి: భారత్​కు ఆడాలనుకుని.. ప్రత్యర్థిగా బరిలోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.