ETV Bharat / sports

లంకతో సిరీస్​.. మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!

Deepak Chahar Injury: శ్రీలంకతో టీ-20 సిరీస్​కు ముందు భారత్​కు ఎదురుదెబ్బ తగిలింది. బౌలర్​ దీపక్​ చాహర్​, సూర్యకుమార్​ యాదవ్​ దూరమైనట్లు తెలిసింది.

Deepak Chahar out of Sri Lanka T20Is
చాహార్​ దూరం
author img

By

Published : Feb 23, 2022, 5:36 AM IST

Updated : Feb 23, 2022, 8:47 AM IST

Deepak Chahar, Suryakumar yadav Injury: శ్రీలంకతో టీ20 సిరీస్​కు ముందు టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ప్లేయర్లు సిరీస్​కు దూరమవుతున్నారు. ఇప్పటికే కేఎల్​ రాహుల్​, అక్షర్​ పటేల్​ దూరమవ్వగా.. ఇప్పుడు దీపక్ చాహర్​, సూర్యకుమార్​ యాదవ్​ కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వెస్టిండీస్​తో జరిగిన సిరీస్​లో గాయపడ్డ దీపక్​.. ఇంకా కోలుకోలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే సూర్యకుమార్​ యాదవ్​ చేతికి గాయం అయినట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరిని సిరీస్​కు దూరం ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

''దీపక్​ చాహర్​ సిరీస్​ మొత్తానికి దూరమయ్యాడు. తిరిగి కోలుకునే వరకు జాతీయ క్రికెట్​ అకాడమీలో ఉంటాడు.''
- బీసీసీఐ అధికారి

కాగా, ఇటీవలి కాలంలో బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్నాడు చాహర్​. వెస్టిండీస్​తో ఆదివారం కోల్​కతాలో జరిగిన మూడో టీ-20 సందర్భంగా.. బౌలింగ్​ చేస్తూ గాయపడ్డాడు. అప్పుడే మైదానాన్ని వీడగా.. అతడి బౌలింగ్​ కోటాను వెంకటేశ్​ అయ్యర్​ పూర్తిచేశాడు. శ్రీలంకతో 3 మ్యాచ్​ల టీ-20 సిరీస్​ ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది.

ఐపీఎల్​కు కూడా..!

మార్చి చివరివారంలో ఐపీఎల్​-15 ప్రారంభం కానున్న నేపథ్యంలో.. దీపిక్ అప్పటికి ఫిట్​నెస్​ సాధిస్తాడో లేదో చూడాలి.

ఇవీ చూడండి:

ఆ బాలుడికి అండగా భారత స్టార్ క్రికెటర్.. రూ.31 లక్షలు సాయం

ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఐపీఎల్​కు అందుబాటులో ఆసీస్​ స్టార్స్

Tim David IPL 2022: 'బుమ్రాను ఢీకొట్టేందుకు నేను రెడీ!'

Last Updated : Feb 23, 2022, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.