Gujarat Titans Logo: ఈ ఏడాది ఐపీఎల్ అభిమానులకు ప్రత్యేకంగా నిలవనుంది. కొత్త జట్ల రాకతో వినోదం మరింత పెరుగుతుంది. కొత్తగా వచ్చిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లపై కూడా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఏ జట్టు చేయని ప్రయోగం చేస్తోంది. తమ జట్టు లోగోను మెటావర్స్‌లో ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం శనివారం ప్రకటించింది.
అభిమానుల కోసం మెటావర్స్‌లో వర్చువల్ స్పేస్‌ను క్రియేట్ చేసినట్లు గుజరాత్ టైటాన్స్ తెలిపింది. దీంతో భారత్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కోసం వర్చువల్ స్పేస్‌ను ప్రవేశపెట్టిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలవనుంది.
'ది టైటాన్స్ డగౌట్' పేరుతో ఉన్న ఈ వర్చువల్ స్పేస్‌లోనే లోగోను త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్లు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి : 'టీ20 వరల్డ్‌కప్ కోసం టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది'