Gujarat Titans Logo: 2022 ఐపీఎల్లో ప్రవేశించనున్న రెండు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్(జీటీ) తమ జట్టు లోగోను ఆదివారం ఆవిష్కరించింది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు చేయని విధంగా మెటావర్స్‌లో జట్టు లోగో ఆవిష్కరించి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. వర్చువల్ వరల్డ్ అనుభూతిని పొందేందుకు ఈ ప్రయోగం చేసి.. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. 'ది టైటాన్స్ డగౌట్' పేరుతో ఉన్న ఈ వర్చువల్ స్పేస్‌లోనే లోగోను ఆవిష్కరించింది. అందులో జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్లు కనిపించారు.
-
🏃🏃♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏃🏃♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022🏃🏃♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022
సీవీసీ గ్రూప్.. అహ్మదాబాద్ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు.
గుజరాత్ టైటాన్స్.. ప్రీ ఆక్షన్‌లో హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్‌మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. వీరితో పాటు జేసన్ రాయ్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమి, ల్యూకీ ఫెర్గూసన్ వంటి నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసింది. రాహుల్ తెవాటియా, సాయి కిషోర్, అభినవ్ మనోహర్ వంటి ప్రతిభావంతులైన భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసింది.
భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా.. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్.. మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఇదీ చూడండి: ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం.. సిరీస్ కంగారూలదే