ETV Bharat / sports

ఓవర్లు లేకుండా కొత్త ఫార్మాట్​లో 'ది హండ్రెడ్​ లీగ్'

క్రికెట్​లో సరికొత్త అధ్యాయానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెరలేపనుంది. ప్రారంభ ఎడిషన్ 'ది హండ్రెడ్​ లీగ్'​కు సంబంధించి ఆట నిబంధనలు విడుదల చేసింది. అవేంటో మీరూ తెలుసుకోండి.

The Hundred, England Cricket Board
ది హండ్రెడ్​ లీగ్, ప్లేయింగ్ కండిషన్స్
author img

By

Published : Jul 13, 2021, 2:37 PM IST

క్రికెట్​లో మరో కొత్త ఫార్మాట్​కు ప్రాణం పోయడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సిద్ధంగా ఉంది. ప్రారంభ ఎడిషన్ 'ది హండ్రెడ్​' లీగ్ ప్రారంభానికి సంబంధించి ప్లేయింగ్ కండిషన్స్​ను ఈసీబీ విడుదల చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఈ లీగ్​.. జులై 21న ప్రారంభం కానుంది.

ఇకపై ఓవర్ల ఫార్మాట్​కు స్వస్తి చెప్పి బంతులను లెక్కించే పద్ధతి రానుందని ఇంగ్లాండ్ బోర్డు వెల్లడించింది. ఈ 100 బంతుల లీగ్​లో 5 బంతులను ఒక సెట్​గా పరిగణిస్తారు. టీవీ వ్యాఖ్యాతలు మాత్రం ఓవర్లు అనే పదాన్ని వాడనున్నారని స్పష్టం చేసింది.

ఆట నిబంధనలు..

  • ఈ లీగ్ ప్రకారం ఇకపై ఓవర్ల స్థానంలో బంతులను లెక్కిస్తారు.
  • ఐదు బంతులను ఒక 'సెట్'​గా పరిగణిస్తారు. ఒక సెట్​ అయిపోయాక అంపైర్​.. బ్రాడ్​కాస్టర్లు, స్కోర్ బోర్డు, ఆటగాళ్లు, ప్రేక్షకులకు వైట్​కార్డ్​ను చూపిస్తారు.
  • ఒకే ఎండ్​ నుంచి వరుసగా రెండు సెట్లను వేయవచ్చు. అవసరమైతే ఒకే బౌలర్​ రెండు సెట్లను వరుసగా బౌల్ చేయవచ్చు. అంటే ఒక బౌలర్​ పది బంతులను వేయవచ్చు.
  • మొదటి 25 బంతులను మొదటి పవర్​ ప్లేగా పరిగణిస్తారు.
  • తొలి పవర్​ ప్లే తర్వాత ఫీల్డింగ్ జట్టు రెండు నిమిషాల వ్యూహాత్మక విరామాన్ని తీసుకోవచ్చు.
  • గ్రూప్ దశలో మ్యాచ్​ కనుక టై అయితే ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయిస్తారు. నాకౌట్​ మ్యాచ్​ల్లో ఈ నిబంధన వర్తించదు. 'సూపర్​ ఫైవ్​' నిర్వహిస్తారు. అనగా ఇప్పుడున్న 'సూపర్ ఓవర్'​ లాంటిదేనన్న మాట.
  • ఈ 'సూపర్ ఫైవ్' కూడా 'టై' అయితే రెండో సూపర్ ఫైవ్​ నిర్వహిస్తారు. అది కూడా టై అయితే అప్పటివరకు మెరుగైన ప్రదర్శన చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: క్రికెట్ 'మక్కా'లో టీమ్ఇండియా 'దాదా'గిరి!

ఈ టోర్నీలో మొత్తం 8 మహిళ జట్లతో పాటు అదే సంఖ్యలో పురుషుల జట్లు పాల్గొననున్నాయి. వీటిలో స్థానిక ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్లు కూడా పాల్గొనబోతున్నారు. క్రిస్ లిన్, కార్లోస్​ బ్రాత్​వైట్, కొలిన్ మున్రో, ఇమ్రాన్ తాహిర్, డేవన్ కాన్వే వంటి ఆటగాళ్లు ఈ లీగ్​లో కనిపించనున్నారు.

భారత్ నుంచి..

ది హండ్రెడ్​ లీగ్​లో భారత్​ నుంచి పలువురు మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. దీప్తి శర్మ, స్మృతి మంధాన, జెమియా రోడ్రిగ్స్, హర్మన్​ప్రీత్​ కౌర్ ఈ లీగ్​లో అడుగుపెట్టనున్నారు. ఒక్క షెఫాలీ వర్మకు మినహా మిగిలిన నలుగురికి సంబంధించి బీసీసీఐ నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్'​(ఎన్​ఓసీ) లభించింది.

ఈ లీగ్​ ద్వారా విదేశీ స్టార్​ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం మహిళా క్రికెటర్లకు దక్కనుంది. దీంతో వారి ఆటతీరు మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడనుంది. వీరితో పాటు మారిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్, చ్లోయి ట్రియోన్, మిగ్నాన్ డు ప్రీజ్ వంటి దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లూ ఈ లీగ్​లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.