ETV Bharat / sports

ఆసీస్ ఆల్​రౌండర్ కాలికి గాయం..​ ఆటకు గ్లెన్​ మ్యాక్స్​వెల్ దూరం - ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిరీస్

Glenn Maxwell Injury : ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​ వెల్​ క్రికెట్​కు దూరం కానున్నాడు. ఈ మేరకు ఆధికారిక ప్రకటన వెలువడింది. ఓ బర్త్​డే పార్టీలో జరిగిన ప్రమాదంలో మ్యాక్స్​వెల్​ కాలికి గాయం అయింది.

Glenn Maxwell accident
Glenn Maxwell accident
author img

By

Published : Nov 13, 2022, 1:20 PM IST

Glenn Maxwell Injury : గ్లెన్ మాక్స్​వెల్​ క్రికెట్​కు​ దూరం కానున్నాడు. కాలికి గాయం కారణంగా కొన్ని నెలల పాటు ఆట నుంచి విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా సెలెక్షన్​ కమిటీ చీఫ్ జార్జ్​ బెయిలీ అధికారికంగా ప్రకటించారు.
ఆస్ట్రేలియా ఆల్​ రౌండర్​ గ్లెన్​ మాక్స్​వెల్​ కాలికి శనివారం గాయం అయింది. తన స్నేహితుడి ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలో.. ఇంటి బ్యాక్​ యార్డులో సరదాగా పరిగెడుతుండగా.. కాలు జారి కిందపడ్డాడు. అనంతరం అతడి కాలుకు ఫ్రాక్చర్​ అయింది. ఆ సమయంలో మ్యాక్స్​వెల్​ మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు మాక్స్​వెల్​కు జట్టు నుంచి కొన్ని నెలల పాటు తప్పించింది. ఇంగ్లాండ్​ సిరీస్​లో మ్యాక్స్​వెల్​ స్థానంలో సీన్​ అబాట్​ను జట్టులోకి తీసుకుంది.

Glenn Maxwell accident
గ్లెన్​ మ్యాక్స్​వెల్

ఇంగ్లాండ్​తో ఆడబోయే వన్డే సిరీస్​ నుంచి కూడా మ్యాక్స్​వెల్​ను దూరం పెట్టింది. డిసెంబర్​లో జరగబోయే ఆస్ట్రేలియా దేశవాళీ 'షెఫీల్డ్ షీల్డ్' టోర్నమెంట్, ఆ తర్వాత జరిగే దక్షిణాఫ్రికా సిరీస్​కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.
"గ్లెన్​ ఉత్సాహంతో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ అతడికి ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. గత కొన్ని మ్యాచ్​ల్లో గ్లెన్​.. మంచి ప్రదర్శన చేశాడు. అతడు మా వైట్​ బాల్​ క్రికెట్​లో కీలక ఆటగాడు. అతడు త్వరగా కోలుకోవాలని, మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయాలని కోరుకుంటున్నా" అని ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ చీఫ్​ జార్జ్​ బెయిలీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి : 'ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అడిగా..' సైకిల్‌పైనే అకాడమీకి.. కఠోర శ్రమతో జట్టులోకి

ముంబయి ఇండియన్స్​ ఫ్యాన్స్​కు షాక్​.. కీలక ప్లేయర్​ రిలీజ్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.