ETV Bharat / sports

'కోహ్లీ, డివిలియర్స్​ వల్లే అది సాధ్యమైంది'

author img

By

Published : Oct 20, 2021, 7:38 PM IST

టీమ్​ఇండియాతో ఆస్ట్రేలియా వార్మప్​ మ్యాచ్(Ind vs Aus Warm-up Match)​ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్(Maxwell News). ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు విరాట్​ కోహ్లీ, డివిలియర్స్​ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు.

maxwell
మ్యాక్స్​వెల్

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Maxwell on Virat Kohli), దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్​ను ప్రశంసలతో ముంచెత్తాడు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్(Maxwell on RCB). తాను తిరిగి ఫామ్​లోకి రావడానికి కారణం విరాట్, డివిలియర్సే అని అన్నాడు. ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున వారిద్దరితో కలిసి ఆడటం వల్ల తాను '10 అడుగుల ఎత్తు' ఉన్నట్లు ఫీల్​ అవుతున్నానని తెలిపాడు.

"ప్రతి రోజు ఓ కొత్త విషయం నేర్చుకోవాలని నేను పరితపిస్తాను. విరాట్​, డివిలియర్స్​ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనిస్తుండేవాడిని. ఐపీఎల్​కు కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఐపీఎల్ కల్పిస్తుంది."

-మ్యాక్స్​వెల్, ఆసీస్ ఆల్​రౌండర్.

తాను బాగా ఆడితే ఆస్ట్రేలియా తప్పకుండా టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ గెలుస్తుందని మ్యాక్స్​వెల్​ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమ్​ఇండియాతో వార్మప్​ మ్యాచ్​ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్​లో ఆడిన తీరును కొనసాగిస్తే తాను తిరిగి ఫామ్​లోకి వచ్చినట్లే అవుతుందని తెలిపాడు. ఆర్సీబీ తరఫున ఆడి కోహ్లీ, డివిలియర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని మ్యాక్సీ​ పేర్కొన్నాడు. కుడిచేతి బ్యాట్స్​మన్​ను ఔట్​ చేసేందుకు ఓవర్​ ది వికెట్​ బౌలింగ్​ ప్రాక్టీస్​ చేస్తున్నట్లు సష్టం చేశాడు.

ఇదీ చదవండి:

Maxwell IPL: 'చెత్తగా వాగొద్దు.. మేమూ మనుషులమే'

హార్దిక్​ బౌలింగ్ చేస్తాడని ఆశిస్తున్నా: రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.