గ్రాస్ ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది కరీబియన్ జట్టు. సిరీస్‌లో నామమాత్రమైన తదుపరి మ్యాచ్ గురువారం జరగనుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31 బంతుల్లో 30 పరుగులు), హెన్రిక్స్(29 బంతుల్లో 33 పరుగులు) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. వాల్ష్ 2, బ్రావో, అలెన్, మెక్కాయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పూరన్ సేన దూకుడుగా ఆడింది. కేవలం 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(38 బంతుల్లో 67 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. అతనికి సారథి నికోలస్ పూరన్(27 బంతుల్లో 32 పరుగులు) అండగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మెరిడిత్ 3, స్టార్క్ ఒక వికెట్ తీసుకున్నారు.
గేల్ రికార్డు..
తాజా మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో మెరిసిన క్రిస్ గేల్(Chris Gayle).. సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 14వేల పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.
అలెన్ సూపర్ క్యాచ్..
-
Still can't get over this 😮
— Fox Cricket (@FoxCricket) July 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
📺 WATCH: #WIvAUS https://t.co/sOyWx8JbnJ
📝 BLOG: https://t.co/UyzXmx1x5b
📱 MATCH CENTRE: https://t.co/h46JiuKHIB pic.twitter.com/U18dBoSIdY
">Still can't get over this 😮
— Fox Cricket (@FoxCricket) July 13, 2021
📺 WATCH: #WIvAUS https://t.co/sOyWx8JbnJ
📝 BLOG: https://t.co/UyzXmx1x5b
📱 MATCH CENTRE: https://t.co/h46JiuKHIB pic.twitter.com/U18dBoSIdYStill can't get over this 😮
— Fox Cricket (@FoxCricket) July 13, 2021
📺 WATCH: #WIvAUS https://t.co/sOyWx8JbnJ
📝 BLOG: https://t.co/UyzXmx1x5b
📱 MATCH CENTRE: https://t.co/h46JiuKHIB pic.twitter.com/U18dBoSIdY
ఈ మ్యాచ్‌లో ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు విండీస్ బౌలర్ ఫాబియాన్ అలెన్. 12వ ఓవర్లో వాల్ష్ వేసిన ఫుల్‌టాస్‌ను భారీ షాట్ ఆడాడు ఫించ్. అది కాస్తా నేరుగా బ్రావో చేతిలో పడినట్లే పడి కింద పడబోయింది. కిందపడే సమయంలో కాలితో బంతిని పైకి లేపగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న అలెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ఆసీస్ కెప్టెన్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడం వల్ల అలెన్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఇదీ చదవండి: 'కోహ్లీ ఐపీఎల్ టైటిలే గెలవలేదు.. ఐసీసీ ట్రోఫీ అంటే?'