ETV Bharat / sports

డబ్బు కోసమే అదంతా చేస్తున్నాను.. సిగ్గు పడట్లేదు: గంభీర్​ - గౌతమ్​ గంభీర్​ వార్తలు

ఐపీఎల్​లో ఈ ఏడాది లఖ్​నవూ జట్టుకు మెంటార్​గా వ్యవహరించి.. ప్లేఆఫ్స్​ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గంభీర్. ఎంపీగా ఉంటూ ఇలా క్రికెట్​లో భాగమవడంపై విమర్శలకు స్పందించిన గంభీర్​.. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే..

gambhir
గంభీర్
author img

By

Published : Jun 4, 2022, 4:01 PM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ ఎంపీగా బాధ్యతలు చేపడుతూనే క్రికెట్​కు సంబంధించిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఐపీఎల్​లో లఖ్​నవూ సూపర్​ జెయంట్స్​ జట్టుకు మెంటార్​గా వహించి జట్టు ప్రదర్శనలో కీలక పాత్ర పోషించాడు. అంతకముందు కూడా పలు క్రికెట్​ మ్యాచ్​లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. పూర్తిస్థాయి ఎంపీగా ఉంటూ క్రికెట్​లో ఎలా భాగమవుతారని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్​.. ఈ విషయంపై స్పందించాడు.

అందుకే ఇలా: తూర్పు దిల్లీ నియోజకవర్గానికి ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్న గంభీర్​ గాంధీనగర్​లో పేదల కోసం జన్​రసోయ్​ పేరుతో ఒక్క రూపాయికే భోజనం అందేలా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతంలోనే ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాడు. వీటి నిర్వహణ కోసమే తాను క్రికెట్​లో భాగమైనట్లు స్పష్టం చేశాడు గంభీర్.

"ప్రతీ నెలా నేను 5000 మందికి భోజనం అందించేందుకు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నాను. అంటే ఏటా రూ.2.75 కోట్లు. లైబ్రరీ నిర్మించేందుకు కూడా నేను రూ.25 లక్షలు ఖర్చు చేశాను. ఇవన్నీ నా సొంతడబ్బులతో ఏర్పాటు చేసినవి. ఎంపీఎల్​ఏడీ ఫండ్​ నుంచి చేసినవి కావు. కాబట్టీ వీటి నిర్వహణకు నాకు డబ్బు అవసరం. మా ఇంట్లో డబ్బులు కాసేటట్టు చెట్లు ఏమీ లేవు. ఇలా డబ్బు కోసం పనిచేస్తున్నందుకు నాకు సిగ్గుగా ఏమీ లేదు. నా లక్ష్యం చేరేందుకే ఇదంతా చేస్తున్నాను."

-గౌతమ్​ గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

కాగా, ఈ ఏడాది కొత్తగా వచ్చిన లఖ్​నవూ సూపర్​ జెయంట్స్​ జట్టుకు ఏర్పాటు చేసిన కోచ్​ల బృందంలో గంభీర్​ భాగమయ్యారు.

ఇదీ చూడండి : ISSF World Cup 2022: మెరిసిన అంజుం.. షూటింగ్​ ప్రపంచకప్​లో రజతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.