Ganguly Show-cause notice To kohli: టీమ్ఇండియా మాజీ సారథి కోహ్లీ.. తనపై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు వస్తున్న కథనాలపై దాదా స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని, అవి అబద్ధం అని స్పష్టం చేశాడు.
గతేడాది సెప్టెంబరులో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్నాడు. ఆ సమయంలో విరాట్‌తో తాను మాట్లాడానని, సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ పేర్కొన్నాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ.. టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని, దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు.
అయితే.. విరాట్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు గంగూలీకి కోపం తెప్పించాయని, దీంతో అతడికి షోకాజ్ నోటీసులు పంపించాలని అనుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
గతవారం కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఆ సమయంలో "టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడం కోహ్లీ వ్యక్తిగత విషయం. విరాట్ సారథ్యంలో టీమ్ఇండియా ఎన్నో విజయాలను సాధించింది. కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది. విరాట్ గ్రేట్ ప్లేయర్. వెల్డన్" అని ట్వీట్ చేశాడు గంగూలీ.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: IPL 2022: కెప్టెన్‌లుగా రాహుల్, హార్దిక్ పాండ్య