నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు. భారత్‌లో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు నిర్వహణ పరమైన అడ్డంకులు ఉన్నాయని తెలిపాడు.
“ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లు భారత్‌లో జరగవు. 14 రోజుల క్వారంటైన్ వంటి నిర్వహణ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ ఏర్పాటు చేయడం చాలా కష్టం. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ రద్దీ దృష్ట్యా మిగతా మ్యాచ్‌ల్ని ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. తగిన సమయం కోసం ప్రయత్నించాలి. ఇంగ్లాండ్‌లో పర్యటన తర్వాత టీమ్‌ఇండియా 3 వన్డేలు, 5 టీ20ల కోసం శ్రీలంక వెళ్లనుంది” అని గంగూలీ చెప్పాడు.
ఇదీ చదవండి: దేశవాళీ క్రికెట్ వల్ల దాని విలువ తెలిసింది: అర్జాన్