శుక్రవారం ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్(ICC test championship) మ్యాచ్‌లో టీం ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకోవడమే మేలని అభిప్రాయపడ్డారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly). ఇప్పటివరకు విదేశాల్లో ఆడిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ ఎంచుకోవడమే టీమ్ఇండియా(Team India ICC test championship)కు కలిసివచ్చిందని అన్నారు. చివరి మ్యాచ్‌లో ఇబ్బంది పడటం కన్నా మొదట బ్యాటింగ్ ఎంచుకుని ఒత్తిడిని తగ్గించుకోవడం కొహ్లీ సేనకు కలిసివస్తుందని చెప్పారు.
విదేశాల్లో ఆడిన రికార్డులను పరిశీలిస్తే.. గెలిచిన సందర్భాల్లో మనం బ్యాటింగ్‌నే ఎంచుకున్నాము. 2002, 2018 సౌత్ ఆఫ్రికాతో మొదట బ్యాటింగ్‌ను ఎంచుకున్నాము. ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ విజయం సాధించాం. భారత జట్టు ఈ కప్‌ను గెలుచుకుంటుంది. కానీ అది అంత సులువైన పని కాదు. కివీస్‌ను తక్కువ అంచనా వేయకూడదు.
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ల బాధ్యతను గుర్తుచేశారు గంగూలీ. కనీసం 20 ఓవర్లైన ఆడాలని అభిప్రాయపడ్డారు. ఇది తర్వాత వచ్చే పుజారా, కోహ్లీ, పంత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.