ETV Bharat / sports

లండన్​ వీధుల్లో 'దాదా' చిందులు.. నైట్​పార్టీలో హంగామా - గంగూలీ లండన్​ సెలబ్రేషన్స్​

Ganguly birthday celebrations video: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తన 50వ పుట్టినరోజు వేడుకలను లండన్​లో ఘనంగా జరుపుకున్నాడు. అక్కడి వీధుల్లో కుటుంబం, మిత్రులతో కలిసి పలు హిట్​ సాంగ్​లకు చిందులేస్తూ ఎంజాయ్​ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ట్రెండ్​ అవుతోంది.

ganguly birthday celebrations
గంగూలీ బర్త్​డే సెలబ్రేషన్స్​
author img

By

Published : Jul 9, 2022, 11:55 AM IST

Ganguly birthday celebrations video: టీమ్​ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తన 50వ పుట్టినరోజు వేడుకలను లండన్​లో ఘనంగా జరుపుకున్నాడు. అడ్వాన్స్​ బర్త్​డే సెలబ్రేషన్స్​ను సచిన్​ సహా మిగతా స్నేహితులతో కలిసి ముంబయిలో చేసుకున్న దాదా.. లండన్​లో మరోసారి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. లండన్​ వీధుల్లో భార్య డోనా, కూతురు సనాతో సహా మరికొంతమంది మిత్రులతో కలిసి ఫుల్​ ఎంజాయ్​ చేశాడు.

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన 'ఓం శాంతి ఓం' సినిమాలోని టైటిల్​ సాంగ్​కు కూతురితో కలిసి చిందులేయగా.. మరో హిందీ హిట్​ సాంగ్​కు భార్య డోనాతో కాలుకదిపాడు దాదా. అలా రోడ్లపై స్టెప్పులేస్తూ సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. గంగూలీలో దాదాగిరితో పాటు ఈ కోణం కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే హ్యాపీ బర్త్​డే విషెస్​ తెలుపుతున్నారు.

ఇదీ చూడండి: సీన్​ అదిరింది.. ప్రపంచకప్​లో గోల్​ కొట్టి.. బాయ్​ఫ్రెండ్​ను ముద్దులతో తడిపి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.