Gautam Gambhir Kohli: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో తప్పకుండా వంద సెంచరీలను పూర్తి చేస్తాడని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ క్రికెటర్‌కు అయినా తన మొదటి అంతర్జాతీయ శతకం చాలా ప్రత్యేకమని గంభీర్ అన్నాడు.
2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తాను సాధించిన 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును విరాట్‌కు ఇచ్చిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గంభీర్ గుర్తు చేసుకున్నాడు. ఆ వన్డేలో కోహ్లీ 114 బంతుల్లో 107 పరుగులు చేయగా.. గంభీర్ 150 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
"విరాట్ కోహ్లీ తన మొదటి సెంచరీని సాధించినప్పుడు అతడి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనుకున్నాను. అందుకే నాకు వచ్చిన అవార్డును ఇచ్చేశాను. అతడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని అనుకుంటున్నాను. ఎవరికైనా తొలి సెంచరీ చాలా ప్రత్యేకం. విరాట్ వంద అంతర్జాతీయ సెంచరీలు చేయగలడని కచ్చితంగా భావిస్తున్నాను. బంగ్లాదేశ్‌లో నా తొలి అంతర్జాతీయ సెంచరీతో పాటు శ్రీలంకపై చేసిన తొలి వన్డే సెంచరీ నాకు ఇప్పటికీ గుర్తుంది" అని గంభీర్ అన్నాడు.
ఇదీ చదవండి: 'అవన్నీ పుకార్లే.. ధోనీ అంటే నాకు చాలా గౌరవం'