క్రికెట్ అంటేనే బ్యాట్‌కు బంతికి మధ్య పోరాటం. బ్యాటర్లు బంతిని బాదడానికి ప్రయత్నిస్తే.. బౌలర్లు వారిని కట్టడి చేసి పెవిలియన్‌కి పంపాలని చూస్తారు. అందుకే ప్రతి పరుగునూ కీలకంగా భావిస్తారు. ఇలా పరుగులు చేసే క్రమంలో కొన్నిసార్లు బ్యాటర్లు రనౌట్ అవుతారు. అయితే, అప్పుడప్పుడు వారికి అదృష్టం కలిసొచ్చి ఫీల్డర్ల తప్పిదాలతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడతారు. అలాంటి ఘటనే చెక్ రిపబ్లిక్‌లో జరిగిన యూరోపియన్ లీగ్ సిరీస్‌లో చోటుచేసుకుంది.
-
They sneaked in 3️⃣ runs out of nowhere!!🤯😆 @CzechCricket#EuropeanCricketSeries #CricketInCzechRepublic pic.twitter.com/Ld3olDLeuT
— European Cricket (@EuropeanCricket) June 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">They sneaked in 3️⃣ runs out of nowhere!!🤯😆 @CzechCricket#EuropeanCricketSeries #CricketInCzechRepublic pic.twitter.com/Ld3olDLeuT
— European Cricket (@EuropeanCricket) June 8, 2022They sneaked in 3️⃣ runs out of nowhere!!🤯😆 @CzechCricket#EuropeanCricketSeries #CricketInCzechRepublic pic.twitter.com/Ld3olDLeuT
— European Cricket (@EuropeanCricket) June 8, 2022
ఈ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో ఒకేసారి ఇద్దరూ బ్యాటర్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మూడుసార్లు రనౌట్ చేసే అవకాశం వచ్చినా ఫీల్డర్లు అయోమయానికి గురై ఓవర్ త్రోలు విసిరారు. ఫీల్డర్ల తప్పిదంతో వీరిలో ఒక్కరూ కూడా ఔట్ కాకపోగా.. అదనంగా మూడు పరుగులు వచ్చాయి. ఈ సన్నివేశాన్ని చూసిన వారు.. 'ఇదేం ఫీల్డింగ్ రా బాబూ..' అంటూ పగలబడి మరీ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది.
ఇదీ చూడండి : కోహ్లీ తర్వాత పంత్‌కే ఇలా చేదు అనుభవం