ETV Bharat / sports

రిఫరీపై పిడి గుద్దులు.. ఆ ఫుట్​బాలర్​పై 30ఏళ్ల పాటు నిషేధం

author img

By

Published : Jan 28, 2023, 2:22 PM IST

మ్యాచ్​​ జరుగుతున్న జరిగిన గొడవలో ఓ ఫుట్​బాలర్​.. రిఫరీని తీవ్రంగా కొట్టాడు. అతడిపై పిడి గుద్దులు వర్షం కురిపించాడు. రిఫరీ తీవ్రంగా గాయప్డడాడు. దీంతో సదరు ప్లేయర్​పై 30ఏళ్ల పాటు నిషేధం పడింది.

French Footballer Gets 30-Year Ban For Punching Referee
రిఫరీపై పిడి గుద్దులు.. ఆ ఫుట్​బాలర్​పై 30ఏళ్ల పాటు నిషేధం

క్రీడల్లో వివాదాలు, గొడవలు జరగడం సహజం. అప్పుడప్పుడు అవి కొట్టుకునే స్థాయికి వెళ్లడం మనం చూస్తుంటాం. అలాంటి సమయాల్లో క్రమశిక్షణ చర్యల కింద ప్లేయర్స్​పై నిషేధించడం కూడా విధిస్తుంటారు. తాజాగా ఓ ఫ్రాన్స్​ పుట్​బాలర్​కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడు ఆడకుండా 30ఏళ్ల పాటు నిషేధం విధించారు. ఈ విషయాన్ని సెంట్రల్​ ఫ్రాన్స్​లోని లాయిరెట్​ ఫుట్​ బాల్​ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​ బెనోయిట్‌ లెయిన్‌ తెలిపారు. అయితే సదరు ప్లేయర్​ వివరాలు మాత్రం తెలపలేదు.

అతడి వయసు 25ఏళ్లని, Entente Sportive Gatinaise క్లబ్​కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని చెప్పారు. మ్యాచ్​ జరుగుతుండగా జరిగిన గొడవలో అతడు రిఫరీపై పంచుల వర్షం కురిపించాడన్న కారణంతో 30 ఏళ్ల నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. లోకల్‌ కప్‌లో భాగంగా జనవరి 8న జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగిందన్నారు. గాయపడిన బాధితుడు రిఫరీ దెబ్బల తాకిడికి రెండురోజుల పాటు బెడ్‌పై నుంచి లేవ లేకపోయాడని అన్నారు.

ఘటన జరిగిన రోజే ఆటగాడిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి 30 ఏళ్ల పాటు బ్యాన్ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత పోలీసులకు అప్పజెప్పినట్లు వెల్లడించారు. అలాగే ఆటగాడి చర్య వల్ల అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్‌ను రెండు సీజన్ల పాటు టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధించినట్లు బెనోయిట్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు: హార్దిక్‌ పాండ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.