'ది హండ్రెడ్' టోర్నీలో పాల్గొనడానికి భారత మహిళ క్రికెటర్లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)ను జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమియా రోడ్రిగ్స్, దీప్తి శర్మలకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చింది. ఈ లీగ్‌ను ఇంగ్లాండ్ వేదికగా గతేడాది నిర్వహించతలపెట్టారు. కానీ, కొవిడ్ కారణంగా ఆ టోర్నీ వాయిదా పడింది.
బీసీసీఐ అనుమతితో ఈ జూన్-జులైలో యూకే వేదికగా జరిగే ఒక టెస్టు, మూడు వన్డేలు, మరికొన్ని టీ20ల్లో ఆడటానికి అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఐపీఎల్-14లో రీఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్!
ఇందుకు సంబంధించి ఎన్ఓసీలను ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు అందజేసింది బీసీసీఐ. ప్రస్తుతం అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే 'ది హండ్రెడ్' టోర్నీలో పాల్గొనే జట్టును ప్రకటించనున్నట్లు ఓ క్రీడా ఛానెల్ తెలిపింది.
'ది హండ్రెడ్' అనేది 100 బంతుల టోర్నీ. ఈ లీగ్‌లో ప్రముఖ ఆటగాళ్లు(పురుషులు, మహిళలు) పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: క్వారంటైన్లో సీఎస్కే.. రాజస్థాన్‌తో మ్యాచ్ వాయిదా