ETV Bharat / sports

'ఇప్పుడే ఫామ్​లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్​ ఇస్తే ఎలా?'.. మేనేజ్​మెంట్​పై మాజీలు ఫైర్​! - sports

'ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్‌ ఇస్తే ఎలా? అంటూ టీమ్​ఇండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు. సౌతాఫ్రికాతో మూడో టీ20కి కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Kohli Rahul Rested
Kohli Rahul Rested
author img

By

Published : Oct 4, 2022, 12:21 PM IST

Kohli Rahul Rested: విరాట్ కోహ్లీ చాలా రోజులపాటు ఫామ్‌ కోసం తంటాలు పడి.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు. కేఎల్‌ రాహుల్‌ కూడా గాయంతో చాలా రోజులు టీమ్‌కు దూరంగా ఉండి వచ్చాడు. తన స్ట్రైక్‌రేట్‌, వైఫల్యాల విమర్శల నుంచి బయటపడి మునుపటి మెరుపులు మెరిపించే పనిలో ఉన్నాడు. అలాంటి ఈ ఇద్దరి క్రికెటర్లను సౌతాఫ్రికాతో జరగబోయే మూడో టీ20కి విశ్రాంతినివ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

'ఇప్పుడే ఫామ్‌లోకి వస్తున్నారు.. అప్పుడే పక్కన పెడితే ఎలా?' అంటూ పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా మాజీ బౌలర్‌ దొడ్డ గణేష్ కూడా మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్వీట్‌ చేశాడు. "కేఎల్‌ రాహుల్‌ ఇప్పుడిప్పుడే తన రిథమ్‌ను అందుకున్నాడు. అతనితోపాటు కోహ్లీకి మూడో టీ20కి విశ్రాంతి ఇచ్చారు. నాకు ఇది అర్థం కాలేదు. ఈ ఇద్దరూ చాలా కాలం పాటు టీమ్‌కు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు. ఫామ్‌లో ఉన్నప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, రన్స్‌ చేయాలి. నేను నమ్మేది అయితే అదే" అని గణేష్‌ ట్వీట్‌ చేశాడు.

ఆసియాకప్‌లో విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో దానిని కొనసాగించాడు. అటు రాహుల్‌ కూడా తన స్ట్రైక్‌రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడిప్పుడే మెరుపులు మెరిపిస్తున్నాడు. రెండో టీ20లో అతడు కేవలం 28 బాల్స్‌లో 57 రన్స్‌ చేశాడు. ఈ ఇద్దరూ టీమ్‌లో లేకపోవడంతో మూడో మ్యాచ్‌కు శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా తుది జట్టులోకి రానున్నారు.

ఇవీ చదవండి: 'నెర్వస్​ 19'.. బౌలింగ్​ ఫోబియా నుంచి రోహిత్​ సేన ఎలా బయటపడుతుందో?

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్​.. ఫైనల్​కు స్పెషల్ గెస్ట్​గా మిథాలీ రాజ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.