Sourav Ganguly Teamindia : ఐసీసీ నిర్వహించే అన్ని క్రికెట్ ఫార్మాట్లకు సంబంధించి కీలకమైన మెగా టోర్నీల్లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై ఇటీవలే తలెత్తుతున్న ప్రశ్నకు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సమాధానం ఇచ్చాడు . 'మన వాళ్లు లీగ్ మ్యాచుల్లో అద్భుతంగా ఆడతారు.. కానీ అస్సలు పోరులోనే చేయ్యిస్తారు' అని దాదా వ్యాఖ్యానించాడు. ఇందుకు గల కారణం మానసిక ఒత్తిడి కాదని.. సరైన ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేయకపోవడమే అని ఆయన పేర్కొన్నాడు.
చాలా సందర్భాల్లో ఐసీసీ టోర్నమెంట్‌లలో జరిగే కీలకమైన నాకౌట్ మ్యాచుల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆటతీరును కనబరచలేదన్న విషయంపై ఇప్పటికీ అనే విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. లీగ్ దశల్లో అద్భుతంగా రాణించి నాకౌట్‌లో మాత్రం మొండిచేయి చూపిస్తారు అని కూడా పలువురు కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
"2013 తర్వాత భారత్ నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోగా.. ఇంకొన్ని సార్లు సెమీఫైనల్స్ వరకు వెళ్లింది. కానీ ఆ కీలకమైన దశలోనే బాగా రాణించలేదు. ఇందుకు కారణం మాత్రం మానసిక ఒత్తిడి అని నేను అనుకోవటం లేదు. సరైన ప్లాన్‌ను అమలు చేయకపోవడమే అని భావిస్తున్నాను. మన ప్లేయర్స్ మానసికంగా ఎంతో దృఢమైన వాళ్లు. భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో ఈసారి జట్టులో ఉన్న మంచి ఆటగాళ్లందరూ బాగా రాణిస్తారు. నాకౌట్ దశలో అద్భుతంగా ఆడతారు."
- సౌరభ్ గంగూలీ, మాజీ కెప్టెన్
Team India Trophies : 2011లో జరిగిన ప్రపంచకప్, 2012లో ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గుకురావడం మినహా మిగతా అన్నీ మెగా టోర్నీల్లోనూ భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. మ్యాచ్ లీగ్ టైమ్‌లో బాగానే ఆడిన టీమ్ఇండియా నాకౌట్ దశల్లో మాత్రం పేలవ ప్రదర్శనలు చేసి నిరాశతోనే వెనుదిరిగేది. ఆ తర్వాత 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021, 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లు ఇలా ఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి టోర్నీలోని కీలకమైన నాకౌట్ దశలోనే ఓటమి పాలైంది. అయితే 2013లో భారత్.. ధోనీ సారథ్యంలోని ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ కప్‌ను గెలిచిన తర్వాత మరో ఐసీసీ టైటిల్‌ను గెలవకలేకపోయింది. మరి ఈసారి స్వయంగా భారత్‌లో జరుగుతున్న 2023 ప్రపంచకప్ సమరంలోనైనా అద్భుతంగా రాణించి ట్రోఫీ కరువును తీర్చాలని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.