ETV Bharat / sports

'కఠోర సాధనతోనే.. ఇంగ్లాండ్​పై విజయం' - ajinkya rahane news today

కఠోర సాధనతోనే ఇంగ్లాండ్​పై టెస్టుల్లో విజయం సాధించగలమని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆగస్టు 4 నుంచి తొలి మ్యాచ్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kohli
విరాట్ కోహ్లీ
author img

By

Published : Aug 2, 2021, 10:36 PM IST

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య ఐదు టెస్టుల సిరీస్​ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా సన్నద్ధతపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కఠిన సాధనతోనే, ఇంగ్లాండ్​పై టెస్టు​ సిరీస్​లో విజయం సాధించగలమని స్పష్టం చేశాడు.

కఠోర శ్రమతోనే..

'ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​లో ప్రతిరోజూ కఠిన సాధన అవసరం. కఠోరంగా శ్రమిస్తూ, మనకు మనం చెప్పుకోవాలి. పరిస్థితులను అధిగమించాలని నిశ్చయించుకోవాలి. పనిభారం, మానసిక భారానికి సిద్ధపడి ఉండాలి' అని కోహ్లీ చెప్పాడు.

ఇంగ్లాండ్​లో ఆ జట్టుపై విజయం సాధించటం.. వేరేచోట గెలవడం కంటే ఎక్కువని కోహ్లీ అన్నాడు. మైదానంలో దిగిన తర్వాత ప్రతి మ్యాచ్​ సొంతం చేసుకోవాలనే దృక్పథంతోనే ఆడతామన్నారు. రికార్డుల కోసం ఆడొద్దని, అలా అనుకుంటే తాను ఇప్పటివరకు సాధించిన విజయాల్లో సగం కూడా అందుకునేవాడిని కానని స్పష్టం చేశాడు. కఠోరమైన సాధనతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశాడు.

శార్దుల్​ చేయగలడు..

rahane
రహానే

బౌలర్ శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్​ చేయగలడని టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్ అజింక్యా రహానె అన్నాడు. ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​లో లోయర్ ఆర్డర్​లో శార్దుల్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నట్లు సంకేతాలు పంపాడు.

బౌలర్లు నెట్స్​లో శ్రమిస్తున్నారని, చివర్లో వాళ్లు 20-30 పరుగులు చేసినా ఎంతో ప్రాధాన్యమేనని రహానె అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో శార్దుల్​ ఏడు వికెట్లు తీయటమే కాకుండా, అర్ధశతకంతో అదరగొట్టాడు.

నెం.3 స్థానంలో..

'పుజారా నెం.3 స్థానంలో పటిష్టంగా ఉన్నాడు. అతను అదే స్థానంలో కొనసాగుతాడు. అయితే భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదే విషయంపై కెప్టెన్, కోచ్​, మేనేజ్​మెంట్ నిర్ణయం తీసుకుంటుంది' అని రహానె స్పష్టం చేశాడు.

అతడిని గౌరవిస్తాం..

బెన్​స్టోక్స్ నిర్ణయాన్ని టీమ్​ ఇండియా గౌరవిస్తుందని రహానె తెలిపాడు. స్టోక్స్ ఆటకు విరామం ఇచ్చి.. తన మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించటాన్ని.. ఇంగ్లాండ్ జట్టు కూడా గౌరవిస్తుందని తెలిపాడు.

ఇదీ చదవండి: Cricket News: రోహిత్ శర్మ చెప్పిన కొత్త గేమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.