Hardik Pandya Fitness: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై ధ్యాస పెట్టినట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న పాండ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లోనూ హార్దిక్‌కు చోటు లభించడం కష్టంగానే మారింది.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వరకు తనను పరిగణలోకి తీసుకోవద్దని పాండ్య.. సెలక్టర్లను కోరినట్లు సమాచారం. పూర్తి ఫిట్నెస్ సాధించాకే(Hardik Pandya Focusing on Overall Fitness) జట్టులోకి తిరిగి వస్తానని వారితో అతడు చెప్పినట్లు తెలుస్తోంది.
బ్యాటర్‌గానే..
2021లో ఐపీఎల్ సీజన్లో పాండ్య ముంబయి జట్టు తరఫున ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. టీ20 ప్రపంచకప్‌లోనూ ఉత్తమ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పాండ్య ఫిట్‌నెస్‌పై విమర్శలు మరింత పెరిగాయి.
దక్కని అవకాశం..
టీ20 ప్రపంచకప్‌లో ప్రభావం చూపని కారణంగానే హార్దిక్‌ను న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకుండా పక్కనపెట్టేశారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ నిరూపించుకుంటేనే దక్షిణాఫ్రికా పర్యటనలో చోటు కల్పించే అవకాశముంటుందని బీసీసీఐ వర్గాలు ఇటీవలే తెలిపాయి. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.
సందిగ్ధంలో..
South Africa Covid Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్(బీ.1.1.529)తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తమ దేశంలోనూ ఆ వేరియంట్ ప్రభావం కనిపిస్తుందంటూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోత్స్వానా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు(South Africa Travel Ban) విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త రకంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే సిరీస్ సందిగ్ధంలో పడింది.
ఇదీ చదవండి: