ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు(fifth test india vs england) రద్దుపై విమర్శించిన వారికి గట్టి సమాధానమిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఐపీఎల్ కోసమే ఈ మ్యాచ్‌ను క్యాన్సిల్ చేశారంటూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నాడు. ఆటగాళ్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
"ఆటగాళ్లు ఆడటానికి తిరస్కరించారు. అలా అని వారిని నిందించడం సరికాదు. ఫిజియో యోగేశ్ ఆటగాళ్లతో బాగా సన్నిహితంగా ఉంటాడు. వారికి ప్రతిరోజు మసాజ్ చేస్తాడు. అతడికి కరోనా సోకిందని తెలియగానే ఆటగాళ్లు భయపడ్డారు. అందుకే ఆడనన్నారు. బీసీసీఐ బాధ్యతారహితంగా వ్యవహరించదు. మిగతా బోర్డులను గౌరవిస్తుంది. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌ను సింగిల్ మ్యాచ్ సిరీస్‌గా నిర్వహిస్తాం."
-గంగూలీ, బీసీసీఐ అధ్యుక్షుడు.
కరోనా కారణంగా ఇంగ్లాండ్ టీమ్ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దు అయింది. అయితే ఐపీఎల్ కోసమే దీన్ని క్యాన్సిల్ చేశారంటూ ప్రత్యర్థి జట్టుకు చెందిన మాజీ ఆటగాళ్లు విమర్శించారు. ఆటగాళ్లు వైరస్ బారిన పడితే ఐపీఎల్ రెండో దశ సుజావుగా సాగదనే నేపథ్యంలో భారత ప్లేయర్స్ తప్పుకొన్నారని ఆరోపించారు.
రికార్డు దూరం
ప్రస్తుతానికి ఈ సిరీస్ ముగిసిందని గంగూలీ తెలిపాడు. దీంతో చాలా ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో గెలిచి రికార్డు సృష్టించాలనుకున్న కోహ్లీసేన ఆశ నెరవేరలేదు. చివరగా 1971లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గెలిచింది టీమ్ఇండియా.
ఇదీ చూడండి: ఆ ఫలితం తర్వాతే స్వదేశానికి రవిశాస్త్రి