ETV Bharat / sports

'టీమ్​ఇండియా కోచ్​గా రవిశాస్త్రికి అది పెద్దలోటే'

author img

By

Published : Nov 8, 2021, 7:33 PM IST

ప్రధాన కోచ్​ రవిశాస్త్రి.. ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా గెలవకపోవడం పెద్ద లోటేనని ఆకాశ్ చోప్రా అన్నారు. కానీ టెస్టుల్లో మాత్రం ఎన్నో మరపురాని విజయాలు అందుకుందని చెప్పారు.

Ravi Shastri
రవిశాస్త్రి

కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో విదేశాల్లో ఎన్నో ఘన విజయాలు సాధించిన టీమ్​ఇండియా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం పెద్ద లోటని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు.

'కోచ్‌గా రవిశాస్త్రి నేతృత్వంలో భారత్ మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొంది. అయితే, ఒక్క దాంట్లో కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అయితే కనీసం సెమీ ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో గొప్పగా రాణిస్తోన్న టీమ్​ఇండియా.. ఐసీసీ టోర్నీలో మాత్రం చతికిలపడుతోంది. కోచ్‌గా అతడికి ప్రస్తుత టీ20 ప్రపంచకప్పే చివరిది. ఇకపై అతడిని టీమ్​ఇండియా కోచ్‌గా చూడలేం. రవిశాస్త్రి లాంటి గొప్ప కోచ్‌ నేతృత్వంలో భారత్ ఒక్క ట్రోఫీ కూడా సాధించకపోవడం పెద్దలోటే' అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

అయితే, కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమ్​ఇండియా ఎన్నో మరుపురాని విజయాలు సాధించిందని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

'రవిశాస్త్రి నేతృత్వంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమ్​ఇండియా.. రెండుసార్లు ఆ జట్టును తన సొంత గడ్డపైనే మట్టికరిపించింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో కూడా 2-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాలో కూడా టీమ్​ఇండియా గొప్పగా రాణించింది' అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

రవిశాస్త్రి నేతృత్వంలో ఒక్క న్యూజిలాండ్‌లోనే భారత జట్టు ఇప్పటి వరకు పర్యటించలేదు. త్వరలో టీమిండియా కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ ద్రావిడ్‌ నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.