ETV Bharat / sports

PSL 2021: గాయంతో ఆస్పత్రి పాలైన మరో క్రికెటర్​

author img

By

Published : Jun 13, 2021, 8:20 AM IST

పాకిస్థాన్​ సూపర్​లీగ్​(Pakistan Super League)లో మరో విదేశీ క్రికెటర్​ గాయంతో మైదానాన్ని వీడాడు. అంతకుముందు క్వెట్టా గ్లాడియేటర్స్(Quetta Gladiators)​ జట్టులోని ఆల్​రౌండర్​ ఆండ్రూ రస్సెల్(Andre Russell) తలకు బంతి తగిలి​ ఆస్పత్రిలో చేరగా.. ఇప్పుడు అదే జట్టులోని మరో ఆటగాడు ఫాఫ్​ డుప్లెసిస్​(faf du plessis) గాయంతో మైదానాన్ని వీడాడు.

Faf du Plessis taken to hospital after on-field collision with Mohammad Hasnain
PSL 2021: గాయంతో ఆస్పత్రి పాలైన మరో క్రికెటర్​

పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ ఫాఫ్​ డుప్లెసిస్(faf du plessis)​ గాయంతో ఆస్పత్రిలో చేరాడు. శనివారం పీఎస్​ఎల్​లో క్వెట్టా గ్లాడియేటర్స్(Quetta Gladiators)​​ తరఫున ఆడుతున్న డుప్లెసిస్​.. పెషావర్​ జల్మీతో జరిగిన మ్యాచ్​లో బౌండరీని ఆపబోయి క్రమంలో గాయపడ్డాడు.

శనివారం పెషావర్​ జల్మీతో జరిగిన మ్యాచ్​ 7 ఓవర్​లో బౌండరీని ఆపడానికి ఫాఫ్​ డుప్లెసిస్​ డైవ్​ చేశాడు. అప్పుడే ఎదురుగా పాకిస్థాన్​ క్రికెటర్​ మొహమ్మద్​ హస్​నైన్​(Mohammad Hasnain) కాలు డుప్లెసిస్​ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో డుప్లెసిస్​ విలవిలలాడగా.. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చారు. కొంత సమయం తర్వాత క్వెట్టా గ్లాడియేటర్స్​ డగౌట్​లో డుప్లెసిస్​ విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు.

ఇదీ చూడండి: PSL 2021: రస్సెల్​ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.