టీమ్ఇండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అద్భత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. తనదైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో అతడిపై వర్ధమాన క్రికెటర్లతో సహా దిగ్గజాలు సైతన ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చేరాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకుండా బ్యాటింగ్ చేయడం అద్భుతమని ప్రశంసించాడు. "ఫలానా బంతిని సంధిస్తే సూర్యకుమార్‌ను నియంత్రించవచ్చని ఏ బౌలరూ అనుకోకూడదు. ఎందుకంటే అతడి వద్ద అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. పిచ్‌పై విభిన్న ప్రాంతాల్లో పడిన బంతిని విభిన్నమైన షాట్లు కొట్టి పరుగులు రాబట్టగలడు. అయితే అతడి ప్రశాంతత నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆత్మనిగ్రహంతో తన అమ్ముల పొదిలో విభిన్న షాట్లను ఎలాంటి తొందరపాటుకు గురి కాకుండా ఆడగల సమర్థుడు. సైలెంట్‌గా తన పని ముగిస్తాడు. అయితే ఎక్కడ బ్యాట్‌ను ఝుళిపించాలి.. ఎప్పుడు టాప్ గేర్‌లోకి వెళ్లాలనేది సూర్యకుమార్‌కు బాగా తెలుసు. ప్రస్తుతం ఉన్న టీ20 ఫార్మాట్‌లో అతడే అత్యుత్తమ ఆటగాడు. మ్యాచ్‌కు సంబంధించి వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం అద్భుతం" అని డుప్లెసిస్ వెల్లడించాడు.
కాగా, ఈ ప్రపంచకప్‌లో టాప్ బ్యాటర్లు విఫలమైన దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ ఎటువంటి బెరుకు లేకుండా కేవలం 40 బంతుల్లో 68 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. తాజాగా బంగ్లాదేశ్‌పైనా 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. గతంలో నెదర్లాండ్స్ మీద కూడా అర్ధశతకం (25 బంతుల్లో 51 పరుగులు) సాధించాడు.
ఇదీ చదవండి: T20 WorldCup:టీమ్ఇండియా ప్రదర్శనపై దాదా కీలక వ్యాఖ్యలు