ETV Bharat / sports

'ఆ విషయంలోకి సెలెక్టర్లను అనవసరంగా లాగారు' - విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు భారత సెలెక్టర్లు టీ అందించారని గతంలో పలువురు మాజీలు చేసిన ఆరోపణలపై.. మాజీ చీఫ్ సెలెక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. అవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. అందులోకి తమను అనవసరంగా లాగారని పేర్కొన్నారు. తమ పనితీరును భారత జట్టు గుర్తించిందని స్పష్టం చేశారు.

MSK Prasad, serving tea
ఎమ్మెస్కే ప్రసాద్, టీ కప్ వివాదం
author img

By

Published : Jun 14, 2021, 9:04 PM IST

2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు భారత సెలెక్టర్లు టీ అందించారని మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను నాటి చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కొట్టిపారేశారు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన ఆయన ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. అందులో తమ సెలక్టర్లను అనవసరంగా లాగారని పేర్కొన్నారు.

"స్టార్‌ ఆటగాళ్లు లేని సమయంలో టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును వారి సొంతగడ్డపై ఓడించినప్పుడు ఎవరూ సెలెక్టర్లను అభినందించలేదు. ఎవరూ అభినందించకపోయినా మాకేం ఫర్వాలేదు. జట్టు యాజమాన్యం తమ పనితీరును గుర్తించి గౌరవించింది. మాకదే చాలు, బయటివాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదు. తాము ఏం పని చేశామో బోర్డు సభ్యులకు తెలుసని, ముఖ్యంగా టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, పరాస్‌ మాంబ్రేకు బాగా తెలుసు."

-ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ చీఫ్ సెలెక్టర్.

ఎమ్మెస్కే ప్రసాద్‌ 2016 నుంచి 2020 వరకు నాలుగేళ్లు టీమ్‌ఇండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే అతని నేతృత్వంలో 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటన, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలకు భారత జట్టును ఎంపిక చేశారు. అయితే, ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడు, అదే సమయంలో అనుష్కకు టీ అందించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ మాజీ సెలెక్టర్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రసాద్‌ స్పందిస్తూ బయటివాళ్లు ఏమనుకున్నా తాము చేసిన పనిని భారత జట్టు గుర్తించిందన్నారు.

ఇదీ చదవండి: అశ్విన్​పై అజ్మల్ సంచలన ఆరోపణలు.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.