ETV Bharat / sports

'భారత్​-బీ జట్టు ముందు పాకిస్థాన్​ ఓడిపోతుంది' - ఇండియా Vs శ్రీలంక వన్డే సిరీస్​

ప్రస్తుత పాకిస్థాన్​ జట్టును లంక పర్యటనలో ఉన్న భారత జట్టు కచ్చితంగా ఓడించగలదని అభిప్రాయపడ్డాడు పాక్​ మాజీ స్పిన్నర్​ డానిష్​ కనేరియా. ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ నేతృత్వంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడాడు.

Even India B can beat full strength Pakistan team: Danish Kaneria
'పాకిస్థాన్​ను ఓడించడానికి భారత్​-బీ టీమ్​ చాలు'
author img

By

Published : Jul 23, 2021, 3:57 PM IST

Updated : Jul 23, 2021, 6:51 PM IST

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు ఉత్తమంగా రాణిస్తోందని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్​ మాజీ స్పిన్నర్​ డానిష్​ కనేరియా. ప్రస్తుత పాకిస్థాన్​ జట్టును ఈ టీమ్​ కచ్చితంగా ఓడించగలదని జోస్యం చెప్పాడు. భారత జట్టు ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ నేతృత్వంలో యువ ఆటగాళ్లు ఫామ్​లోకి వచ్చారని ప్రశంసించాడు.

"శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రదర్శనతో పాటు.. టీమ్​ ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ద్రవిడ్​.. కుల్దీప్​ను ప్రేరేపించిన విధానం బాగుంది. భారత్​-బి టీమ్​గా పిలుస్తున్న ఈ జట్టు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టును కచ్చితంగా ఓడించగలదు."

- డానిష్​ కనేరియా, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

టీ20 ప్రపంచకప్​ కంటే ముందు ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లో పాల్గొనడం భారత క్రికెటర్లకు కలిసొచ్చే అంశమని డానిష్​ కనేరియా అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా అక్టోబరులో జరగనున్న ఈ ఈవెంట్​ ఫైనల్​లో వెస్టిండీస్​, భారత్​ జట్లు పోటీ అవకాశం ఉందని జోస్యం చెప్పాడు.

శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రస్తుతం వన్డే సిరీస్​ ఆడుతున్న టీమ్​ఇండియా.. ఆదివారం(జులై 25) నుంచి టీ20 సిరీస్​కు సిద్ధం కానుంది. పొట్టి ఫార్మాట్​ సిరీస్​లో భాగంగా ఆడబోయే మూడు మ్యాచ్​ల ద్వారా రాబోయే టీ20 ప్రపంచకప్​ జట్టు ఎంపిక జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి.. IND vs SL: టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​

Last Updated : Jul 23, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.