ETV Bharat / sports

వన్డే సమరం: ఇంగ్లాండ్‌తో భారత అమ్మాయిల ఢీ - england india women's match

ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టును డ్రాగా ముగించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడదే జట్టుతో వన్డే సమరానికి సిద్ధమైంది. ఆదివారం(జూన్​ 27) తొలి వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభంకానుంది. గతంలో టీ20లతో పాటు టెస్టులోనూ రాణించిన ఓపెనర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ అరంగేట్రం చేయనుంది.

indian women team
భారత మహిళా జట్టు
author img

By

Published : Jun 27, 2021, 7:01 AM IST

Updated : Jun 27, 2021, 8:44 AM IST

ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌తో పోరును డ్రాగా ముగించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడదే జట్టుతో వన్డే సమరానికి సిద్ధమైంది. ప్రత్యర్థి గడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమే తొలి వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభంకానుంది.

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి.. ఇటీవల తన తొలి టెస్టులోనూ ఇంగ్లాండ్‌పై గొప్పగా రాణించిన 17 ఏళ్ల ఓపెనర్‌ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ అరంగేట్రం చేయనుంది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. అలవోకగా భారీ షాట్లు ఆడగలిగే ఈ టీనేజీ బ్యాటర్ జట్టుకు అదనపు బలాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఆమె రాకతో బ్యాటింగ్ ఆర్డర్లో కొత్త ఉత్సాహం రానుంది.

మెరుగ్గా ప్రారంభించాలని..

చివరగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ 1-4తో చిత్తయిన టీమ్ ఇండియా.. ఇప్పుడు ఇంగ్లాండ్​పై మంచి ప్రదర్శనతో వచ్చే ఏడాది న్యూజిలాండ్లో జరిగే ప్రపంచ కప్ దిశగా సన్నాహకాలను మెరుగ్గా ప్రారంభించాలని ఆశిస్తోంది.

కీలక ఇన్నింగ్స్ ఆడితేనే..

కెప్టెన్ మిథాలీ రాజ్, ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీతో పాటు పూనమ్ రావత్, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఆల్​రౌండర్ దీప్తి శర్మ, తానియాలతో కూడిన బ్యాటింగ్ విభాగం బలంగానే కనిపిస్తోంది. కానీ ప్రత్యర్థి పటిష్ఠమైన బౌలింగ్ దాడికి ఎదురొడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడితేనే జట్టు విజయం సాధిస్తుంది.

మరి ఈ సవాలుకు భారత అమ్మాయిలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు బౌలింగ్ వెటరన్ పేసర్ జులన్ గోస్వామి బౌలింగ్ భారాన్ని మోయనుంది.

ఇదీ చదవండి : TeamIndia: కివీస్​పై ఓటమి.. మారిన బీసీసీఐ ఆలోచన

Last Updated : Jun 27, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.