ETV Bharat / sports

Ind vs Eng Test: మిడిలార్డర్​ విఫలం.. భారత్​ 364 ఆలౌట్​

రెండో టెస్టులో భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమ్​ ఇండియా 364 పరుగులకే ఆలౌటైంది. టాప్​ ఆర్డర్​ రాణించినప్పటికీ.. మిడిలార్డర్​ విఫలమైంది. చివర్లో పంత్​, జడేజా స్కోరును 300 దాటించారు. అండర్సన్​ 5 వికెట్లు తీశాడు.

England vs India, 2nd Test
ఇండియా-ఇంగ్లాండ్​ రెండో టెస్టు
author img

By

Published : Aug 13, 2021, 7:13 PM IST

Updated : Aug 13, 2021, 7:20 PM IST

ఇంగ్లాండ్​తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​.. 364 పరుగులకు ఆలౌటైంది. రాహుల్​ 129, రోహిత్​ శర్మ 83 రాణించారు. చివర్లో జడేజా 40, పంత్​ 37 పరుగులు చేసినప్పటికీ.. భారత్​ భారీ స్కోరు సాధించలేకపోయింది.

పుజారా, రహానె విఫలం..

ఓపెనర్లు రోహిత్​, రాహుల్​ నిలకడగా ఆడారు. ఇంగ్లాండ్​ పేస్​ దళాన్ని ఎదుర్కొని.. తొలి వికెట్​కు 126 పరుగులు జోడించారు. 83 పరుగులు చేసిన రోహిత్​.. అండర్సన్​ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. అప్పటినుంచి జోరు పెంచిన రాహుల్​.. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పుజారా(9), రహానె(1) మరోసారి నిరాశపరిచారు. కోహ్లీ(42) మంచి ఆరంభాన్ని.. భారీ స్కోరుగా మలచలేకపోయాడు.

కొద్దిసేపు దూకుడుగా ఆడిన పంత్​.. 37 పరుగులు చేసి వెనుదిరిగాడు. టెయిలెండర్లతో కలిసి జడేజా.. స్కోరు 350 దాటించాడు.

జిమ్మీ@5..

ఇంగ్లాండ్​ బౌలర్లలో జేమ్స్​ అండర్సన్​ 5 వికెట్ల ఘనత సాధించాడు. రాబిన్సన్​, మార్క్​ వుడ్​ చెరో రెండు వికెట్లు తీశారు.

England vs India, 2nd Test
5 వికెట్లు తీసిన అండర్సన్​

లార్డ్స్​లో టీమ్​ ఇండియాపై 5 వికెట్ల ఘనత సాధించడం అండర్సన్​కు ఇది నాలుగోసారి.

టెస్టుల్లో మొత్తంగా 31 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు జిమ్మీ.

ఇదీ చూడండి: 28 ఏళ్లకే వరల్డ్​కప్​ విన్నర్ రిటైర్మెంట్

Last Updated : Aug 13, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.