భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుపైనా వరుణుడు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే వర్షం కారణంగా.. టాస్ ఆలస్యం కాగా, భారత్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరోసారి వరుణుడు మరోసారి అడ్డొచ్చాడు. ఈ కారణంగా.. లంచ్ బ్రేక్ ప్రకటించారు.
![England vs India, 2nd Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12752277_test.jpg)
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(35), రాహుల్(10) ఇంగ్లాండ్‌కు వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం 18.4 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 46 పరుగులతో ఉంది. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రోహిత్ శర్మ నాలుగు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
![England vs India, 2nd Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12752277_test2.jpg)
![England vs India, 2nd Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12752277_test3.jpg)
మ్యాచ్‌కు గంగూలీ, జైషా..
లార్డ్స్‌లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జైషా హాజరయ్యారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్, ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చారు.
![England vs India, 2nd Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12752277_test5.jpg)
రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ 3, ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగాయి. గాయమైన శార్దూల్ ఠాకుర్ స్థానంలో ఇషాంత్ శర్మను తుదిజట్టులోకి తీసుకుంది కోహ్లీ సేన. ఇంగ్లాండ్‌కు బ్రాడ్, క్రాలీ, లారెన్స్ దూరం కాగా వారి స్థానాల్లో మార్క్ వుడ్, హసీబ్ హమీద్, మొయిన్ అలీ వచ్చారు.
![England vs India, 2nd Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12752277_test4.jpg)
ఇదీ చూడండి: కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్‌బై!.. ద్రవిడ్‌పైనే అందరి దృష్టి?