Ashes 2023 : బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వేదికగా యాషెస్ సిరీస్ తొలి టెస్టు అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక తొలి రోజు ఆటలో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆచితూచి ఆడే ప్రయత్నమైతే చేయలేదు కానీ.. తన బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ మరోసారి ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించింది. రూట్ మెరుపు సెంచరీ బాదుడుతో తొలి రోజే దాదాపు 400 పరుగులు చేసిన ఔరా అనిపించింది.
ఇక ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా తమదైన స్టైల్లో అద్భుత ప్రదర్శన చూపించారు. 152 బంతుల్లో 118 స్కోర్ చేసిన జో రూట్ తన శతకంతో స్టేడియంను ఓ ఊపు ఊపేశాడు. దీంతో మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. ప్రత్యర్థి ఆసిస్ జట్టును బరిలోకి దించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ఆరంభం నుంచే తన మార్క్ 'బజ్ బాల్' ఆటను ఆసీస్‌కు రుచి చూపింది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతినే క్రాలీ మెరుపు షాట్‌తో బౌండరీకి పంపాడు. అక్కడ నుంచి ఇంగ్లాండ్ అదే దూకుడును ప్రదర్శించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఆ జట్టు జోరు ఏ మాత్రం తగ్గలేదు. క్రాలీ, పోప్ ధాటిగా ఆడారు. ఆ తర్వాత క్రాలీకి రూట్ జత కలిశాక స్కోరు బోర్డు మరింత వేగంగా కదిలింది. 5 రన్‌నేట్‌తో పరుగులు వచ్చాయి.
Eng vs Aus Ashes : క్రాలీ వెనుదిరిగాక.. 176/5తో ఇంగ్లాండ్ కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించింది. కానీ బ్రూక్, బెయిర్‌స్టోల సహకారం వల్ల రూట్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చాలారోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బెయిర్‌స్టో.. రూట్‌తో కలిసి పోటాపోటీగా ఆడి టీ విరామం తర్వాత ఇంగ్లాండ్ స్కోరుకు మరింత వేగాన్ని అందించాడు. బెయిర్‌స్టో ఔటైనా.. స్పిన్నర్ లైయన్ (4/149) ఒకవైపు దెబ్బ తీస్తున్నా.. రూట్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా షాట్లలో మరింత జోరు పెంచాడు. అతడు కొట్టిన రెండు రివర్స్ స్వీప్ సిక్స్‌లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ఈ కుడి చేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో తన 30వ శతకాన్ని అందుకున్నాడు. మరో రెండు వికెట్లు చేతిలో ఉండడం, రూట్ క్రీజులో ఉండడం వల్ల ఇంగ్లాండ్ తొలి రోజే 400పైన పరుగులు చేసేలా కనిపించింది. కానీ అతడి శతకం పూర్తయిన కాసేపటికే అనూహ్యంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక ఆసీస్ బౌలర్లలో లైయన్‌తో పాటు హేజిల్‌వుడ్ రాణించాడు.
మరోవైపు తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 8 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 4 పరుగులు చేసి రెండో రోజు బ్యాటింగ్‌ని నిలబెట్టుకున్నారు.