ETV Bharat / sports

'టెస్టు క్రికెటర్​గా ఏ సమస్యనైనా ఎదుర్కోగలగాలి'

ఇండియన్​ పిచ్​లపై మాజీలు అనేక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ స్పందించాడు. టెస్టు క్రికెటర్లు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే నైపుణ్యం ఉండాలని సూచించాడు. ఎలాంటి ప్రతికూలతనైనా ఆటలో ఆస్వాదించాలని తెలిపాడు.

Thing about being a Test batsman is that you handle all conditions: Stokes on pitches
'టెస్టు క్రికెటర్​గా ఏ సమస్యనైనా ఎదుర్కోగలగాలి'
author img

By

Published : Feb 22, 2021, 12:22 PM IST

చెపాక్​ పిచ్​పై మాజీలు రకరకాల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ స్పందించాడు. టెస్టు ఆటగాళ్లు అన్ని పరిస్థితులను ఎదుర్కొవడంలో నైపుణ్యం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. మరోవైపు మూడో టెస్టులో అగ్రశ్రేణి క్రికెటర్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని చెప్పాడు.

"టెస్టు బ్యాట్స్​మన్​గా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగేలా ఉండాలి. విదేశీ బ్యాట్స్​మన్​గా భారత మైదానాల్లో నిలదొక్కుకోవడం కష్టతరమైనదే. అదే విధంగా మిగిలిన క్రికెటర్లకు ఇంగ్లాండ్​ మైదానాలు కఠినంగా అనిపించొచ్చు. అలాంటి ప్రతికూలతలన్నీ ఆటలో భాగమే! అందుకే మేము వాటిని ఆస్వాదిస్తాం".

- బెన్​ స్టోక్స్​, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​

నాలుగు టెస్టుల సిరీస్​లో ఇంగ్లాండ్​, భారత్​ జట్లు చెరో విజయం సాధించి సిరీస్​ను సమం చేశాయి. ఇందులో గెలిచిన టీమ్ఇండియా ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఆడే అవకాశాన్ని దక్కించుకుకోవాలని సన్నాహాలు చేస్తోంది. లార్డ్స్​ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు న్యూజిలాండ్​ జట్టు ఇప్పటికే ​చేరుకుంది. కివీస్​తో తలపడాలంటే టీమ్ఇండియా ఈ సిరీస్​లో నెగ్గాలి. ఇంగ్లాండ్​ జట్టు ఫైనల్​కు చేరుకోవాలంటే మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలవాల్సిఉంది. ఒకవేళ ఈ సిరీస్​ డ్రాగా ముగిస్తే.. వీరి తర్వాత ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్​కు చేరుతుంది.

ఇదీ చూడండి: మార్స్​పై క్రికెట్​ గ్రౌండ్​!.. ఐసీసీ ఆసక్తికర పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.