ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు భోజన విరామ సమయానికి వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(48) ఉన్నాడు. 21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్(36), రాహుల్ నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సామ్ కరన్ బౌలింగ్‌లో రోహిత్ వెనుదిరిగిన వెంటనే భోజన విరామం ప్రకటించారు.
అంతకుముందు మొదటిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(4/46) షమి(3/28 ), శార్దూల్(2/41), సిరాజ్(1/48) ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జో రూట్(64) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 13 ఓవర్లు ఆడి 21/0 తొలి రోజు ఆటను ముగించింది.
ఇదీ చూడండి: బుమ్రా, రూట్ రికార్డులు.. టీ బ్రేక్‌కు ఇంగ్లాండ్ స్కోరు 138/4