ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా వేగంగా సన్నద్ధమవుతోంది. కోచ్ రవిశాస్త్రి, సహాయ సిబ్బంది ఆధ్వర్యంలో క్రికెటర్లు నెట్స్‌లో సాధన చేస్తున్నారు. పొట్టి క్రికెట్ సిరీసులో అదరగొట్టాలని తపిస్తున్నారు. శుక్రవారం తొలి మ్యాచ్ ఉండటం వల్ల మైదానంలో విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టులో చేరడం వల్ల శిబిరం సందడిగా కనిపిస్తోంది. వారితో పాటు భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ మంచి జోష్‌లో కనిపించారు. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచులు సాధన చేశారు.
హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. నెట్స్‌లో భారీ షాట్లు సాధన చేశాడు. అతడి ప్రాక్టీస్‌ను రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ దగ్గరుండి పరిశీలించారు. ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయని పాండ్య ఇప్పుడు మునుపటి వేగంతో బంతులు విసురుతున్నట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీసులో పరిమితంగా బంతులు విసిరిన అతడు ఇంగ్లాండ్ టీ20 సిరీసులో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తాడని అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోలేదు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధం: హార్దిక్