ETV Bharat / sports

టాస్ మొదలు క్యాచ్​ల వరకు ​ఏదీ కలిసి రావట్లేదు - root double centaury

చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆతిథ్య భారత్​కు ఏదీ కలిసిరావట్లేదు. టాస్​ దగ్గర్నుంచి ప్రతిదీ ప్రతికూలంగానే తయారైంది. వీటికి తోడు టీమ్​ఇండియా ఆటగాళ్లు చేస్తున్న ఫీల్డింగ్​ తప్పిదాలూ పర్యటక జట్టుకు లాభిస్తున్నాయి.

Team India player fielding errors in the first Test
టాస్ మొదలు క్యాచ్​ల వరకు ​ఏదీ కలిసి రావట్లేదు
author img

By

Published : Feb 7, 2021, 8:14 AM IST

మొదటి టెస్టులో టాస్‌ దగ్గర్నుంచి భారత్‌కు అన్నీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌.. తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉన్న పిచ్‌పై పరుగుల పండుగ చేసుకుంది. రెండో రోజు ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడానికి భారత్‌కు చాలా అవకాశాలే వచ్చాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. శనివారం ఉదయం ఆట ఆరంభం కాగానే స్టోక్స్‌ ఔట్‌ కావాల్సింది. బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో అతణ్ని దాదాపు ఔట్‌ చేసినట్లే కనిపించాడు.

అతడి యార్కర్‌ బంతి బ్యాట్‌ను తాకి, షూను తాకి వికెట్ల మీదికి దూసుకెళ్లింది కానీ, వెంట్రుక వాసిలో తప్పిపోయింది. తర్వాత 31 పరుగుల వద్ద స్టోక్స్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అశ్విన్‌ అందుకోలేకపోయాడు. ఆ వెంటనే మిడాన్‌లో పుజారా అతడి క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. స్టోక్స్‌ తర్వాత కూడా కొన్నిసార్లు బంతిని గాల్లోకి లేపాడు. ఇక బట్లర్‌ 18 పరుగులకే వెనుదిరగాల్సింది. సుందర్‌ బౌలింగ్‌లో అతను వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ అంపైర్‌ ఔటివ్వలేదు. అప్పటికే సమీక్షలు వృథా అయిపోవడంతో భారత్‌ చేయడానికేమీ లేకపోయింది. బెస్‌ 19 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రోహిత్‌ వదిలేశాడు.

Team India player fielding errors in the first Test
క్యాచ్​ల నేలపాలు..

తొలి ఇన్నింగ్స్​లో ఇప్పటికే 550కి పైగా పరుగులు చేసింది ఇంగ్లాండ్​. ఈ క్రమంలోనే చెన్నైటెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. వాటిని ఓ సారి పరిశీలిద్దాం.

  • వరుసగా మూడు 150+ స్కోర్లు సాధించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు రూట్‌. బ్రాడ్‌మన్‌ 1937లో ఈ ఘనత సాధించాడు.
  • వందో టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రూట్‌ ఘనత సాధించాడు. సిక్స్‌తో ద్విశతకం పూర్తి చేసిన తొలి ఇంగ్లాండ్‌ ఆటగాడిగా కూడా అతడు నిలిచాడు.
  • విదేశీ గడ్డపై రూట్‌ ద్విశతకాలు. టెస్టుల్లో విదేశాల్లో అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అతడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. గ్రేమ్‌ స్మిత్‌ (4) ముందున్నాడు.
  • ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు భారత బౌలర్లు వేసిన నోబాల్స్‌. 2009 తర్వాత ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఓ జట్టు వేసిన అత్యధిక నోబాల్స్‌ ఇవే.
  • తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ స్కోరు. ఓ పర్యటక జట్టు కెప్టెన్‌ భారత్‌లో టెస్టుల్లో సాధించిన రెండో అత్యధిక స్కోరిది. క్లెవ్‌ లాయిడ్‌ (242 నాటౌట్‌) ముందున్నాడు.
  • స్పిన్నర్‌ అశ్విన్‌ టెస్టు కెరీర్‌లో తొలిసారి నోబాల్‌ వేశాడు. 20614 బంతుల తర్వాత అతడు నోబాల్‌ వేశాడు.

ఇదీ చదవండి: గత అనుభవంతోనే ఇంగ్లాండ్​ డిక్లేర్​ చేయలేదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.