కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. ఉపఖండ పిచ్‌లంటే పండగ చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఆసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో పలు సిరీస్‌లు ఆడిన ఈ ఇంగ్లాండ్ కెప్టెన్.. ప్రస్తుత భారత పర్యటనలోనూ అదరగొడుతున్నాడు. ఇక్కడి పిచ్‌లపై ఎంతలా చేలరేగుతున్నాడనేది అతడి బ్యాటింగ్ సగటు పరిశీలిస్తే అర్థమవుతుంది.
భారత్‌లో భారత్‌పై..
టీమ్ఇండియాతో 2012లో తొలి టెస్టు ఆడాడు రూట్. మొత్తంగా ఇప్పటివరకు 17 టెస్టులాడి.. 62.19 సగటుతో 1,679 పరుగులు చేశాడు. ఇండియాతో ఇండియాలో 7 మ్యాచ్‌లాడిన ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ 64.77 సగటుతో 842 పరుగులు చేసి జోరు మీదున్నాడు. మొత్తం సగటు కంటే భారత్‌లో భారత్‌పై ఆడిన సగటే ఎక్కువ ఉండటం విశేషం.
ఇక చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం కూడా రూట్‌కు బాగానే కలిసొస్తుంది. తాజాగా జరిగిన తొలి టెస్టులో 258 పరుగులు చేసిన ఈ ఇంగ్లీష్ క్రికెటర్.. మొత్తంగా 88 సగటుతో 352 పరుగులు సాధించాడా స్టేడియంలో.
విశాఖతో సహా మొహలీ, రాజ్‌కోట్, నాగ్‌పుర్‌లోని విదర్భ స్టేడియం, ముంబయిలోని వాంఖడే స్టేడియాలూ రూట్‌కు అచ్చొచ్చినవి. ఆ మైదానాల్లో వరుసగా 78, 93, 128, 93, 98 పరుగులు సాధించాడు.
ఉపఖండం పిచ్‌లపై..
- శ్రీలంకతో ఇప్పటివరకు 5 టెస్టులాడిన రూట్.. 65.50 సగటుతో 655 రన్స్ చేశాడు.
- బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 24.50 సగటుతో 98 పరుగులు సాధించాడు.
- యూఏఈలో పాకిస్థాన్‌తో 3 టెస్టులు ఆడిన రూట్, 287 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
- ఉపఖండం పిచ్‌లపై గత ఆరు మ్యాచ్‌ల్లో 40, 218, 11, 186, 1, 228 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున 100 టెస్టులు ఆడి 8,507 రన్స్ చేశాడు. అందులో 20 శతకాలతో పాటు 49 అర్ధ శతకాలు ఉన్నాయి. 5 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లలో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: ఆర్సీబీ బ్యాటింగ్ సలహాదారుగా సంజయ్ బంగర్