టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి గాయం నుంచి కోలుకున్నాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో(Ind vs Eng) నిర్ణయాత్మక ఐదో టెస్టులో(Manchester Test) అతడు ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం టీమ్ఇండియా ప్రాక్టీస్ సెషన్లో షమి కూడా పాల్గొన్నాడు. ఇతడితో పాటు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మనూ చివరి మ్యాచ్ కోసం పరిశీలించే అవకాశం ఉంది.
రాబోయే రెండు నెలల్లో ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup) దృష్టిలో ఉంచుకుంటే.. చివరి టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చి, ఆ స్థానంలో షమిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
రోహిత్, పుజారా ఆడతారా?
నాలుగో టెస్టులో గాయపడిన భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, పుజారాలను మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఆఖరి టెస్టులో వీరిద్దరూ అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.
ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్‌గానే ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నిర్ణయం మాత్రం మెడికల్ బృందంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అఖరి మ్యాచ్‌కు రోహిత్ శర్మ ఫిట్నెస్(Rohit Injury) సాధించకపోతే.. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్, మయాంక్ అగర్వాల్, పృథ్వీషాను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు పుజారా కూడా గాయం(Pujara Injury) నుంచి కోలుకోని పరిస్థితుల్లో హనుమ విహారి లేదా సూర్య కుమార్ యాదవ్‌కు ఛాన్స్ ఇస్తారు.
నిర్ణయాత్మక పోరు కోసం..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు సెప్టెంబరు 10న చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన నెగ్గినా.. డ్రా చేసుకున్నా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇందులో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగుస్తుంది.
ఇదీ చూడండి.. ఐపీఎల్లో ఎయిర్ అంబులెన్స్- 30 వేల RT-PCR కిట్లు