అహ్మదాబాద్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతిసారవ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు. కానీ, తమ ఆటగాళ్లందరూ నాలుగో టెస్టుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. అయితే, ఎవరు అనారోగ్యానికి గురయ్యారనే వివరాలను మాత్రం వివరించలేదు.
ఇంగ్లాండ్ టీమ్‌లోని కొంతమంది ఆటగాళ్లతో పాటు సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ డయేరియాతో బాధపడుతున్నట్లు సమాచారం. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌లు టెస్టు సిరీస్‌లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే చివరి టెస్టులోనూ నెగ్గి.. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని కోహ్లీసేన సంసిద్ధమవుతోంది. మరోవైపు ఆఖరి టెస్టులో గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని ఇంగ్లాండ్ జట్టు ప్రణాళికలను రచిస్తోంది.
ఇదీ చూడండి: సర్జరీ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన జడేజా