ETV Bharat / sports

రూట్ ఖాతాలో మరో రికార్డు.. ఒకే ఒక్క సారథిగా! - ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్

ఇంగ్లాండ్ జట్టు సారథి జో రూట్ చరిత్ర సృష్టించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్​గా రికార్డు నెలకొల్పాడు.

root
జో రూట్
author img

By

Published : Aug 28, 2021, 9:30 PM IST

ఇంగ్లాండ్​ అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్​గా చరిత్ర సృష్టించాడు ఆ జట్టు సారథి జో రూట్. భారత్​తో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన తర్వాత ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రూట్.

2017లో టెస్టు జట్టు కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించిన రూట్​ సారథ్యంలో.. ఆడిన 55 మ్యాచ్​ల్లో 27 మ్యాచ్​లు గెలిచింది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలో 51 మ్యాచ్​లాడి 26 గెలిచిన మైకేల్​ వాన్​ను అధిగమించాడు రూట్. వాన్​ తర్వాత స్థానాల్లో అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ ఉన్నారు.

భారత్-ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న టెస్టు​ సిరీస్​లో భాగంగా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్​ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో గెలిచి సిరీస్​ను 1-1తో సమం చేసింది. ఈ టెస్టులోనూ రూట్ 121 పరుగులతో అజేయ సెంచరీతో మురిపించాడు.

ఇదీ చదవండి:

IndvsEng: 'మూడో టెస్టులో అందుకే ఓడిపోయాం'

INDvsENG: మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.