ETV Bharat / sports

బుమ్రా విషయంలో రోహిత్​ పొరపాటు

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​ అనంతరం రోహిత్​, రహానెలు.. మైక్రోఫోన్​లో మాట్లాడారు. సరదాగా సాగిన ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్​లో పంచుకుంది. ఇందులో రెండో రోజు ఆటపై మాట్లాడిన రోహిత్​.. తదుపరి బ్యాంటింగ్​ చేసేది బుమ్రా అన్నాడు. కానీ జట్టులో బుమ్రా లేకపోవడం అసలు విషయం.

Rohit Sharma forgets playing XI, says Jasprit Bumrah is yet to bat
బుమ్రా పేరుపై పొరబడి.. అంతలోనే తేరుకుని
author img

By

Published : Feb 14, 2021, 8:46 AM IST

Updated : Feb 14, 2021, 9:16 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టుకు భారత పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది యాజమాన్యం. ఆటగాళ్లపై పనిభారం తగ్గించేందుకే ఇలా చేసినా.. తుది 11మందిలో ఎవరున్నారో గుర్తుంచుకోవడం మిగతా జట్టు సభ్యులకు కష్టంగా మారింది.

రోహిత్​ శర్మ అచ్చం ఇలాగే పొరబడ్డాడు. రహానెతో కలిసి సరదాగా మైక్రోఫోన్​లో మాట్లాడాడు హిట్​మ్యాన్​. ఫన్నీగా సాగిన ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పంచుకుంది.

"తొలి ఇన్నింగ్స్​లో ప్రస్తుతం పంత్​, అక్షర్​ క్రీజులో ఉన్నారు. తదుపరి ఇషాంత్​, బుమ్రా బ్యాటింగ్​ చేయాల్సి ఉంది," అంటూ రోహిత్​ చెప్పుకొచ్చాడు. వెంటనే తేరుకుని తన తప్పును సరిదిద్దుకున్నాడు. అంతలోనే అటుగా వచ్చిన ఇషాంత్​ శర్మ.. బుమ్రా ఈ మ్యాచ్​లో ఆడట్లేదంటూ గుర్తుచేశాడు.

పేరు పలకగానే వచ్చేశాడు అంటూ జస్ప్రీత్​ను చూస్తూ రహానె సరదాగా అనడం వీడియోలో కనిపించింది.

ఇదీ చదవండి: 23న మొతేరా స్టేడియాన్ని ఆరంభించనున్న రాష్ట్రపతి

Last Updated : Feb 14, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.