తొలి టెస్టులో వైఫల్యంపై వస్తున్న విమర్శలకు టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ ఆజింక్య రహానె ఘాటుగా బదులిచ్చాడు. చెన్నైలో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలేకరుల సమావేశంలో తన ఫామ్‌పై ప్రశ్నకు బదులిచ్చాడు.
"రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్నాం. భారత్‌లో చివరిసారిగా 2019లో దక్షిణాఫ్రికాతో తలపడ్డాం. ఆ సిరీస్‌లో నా స్కోర్లు (59, 115) గమనిస్తే మీకే తెలుస్తుంది. అందరం ఆడేది జట్టు కోసమే. జట్టుకు ఏ విధంగా సహకరించగలను అన్నదానిపైనే నా దృష్టంతా. గత 10-15 టెస్టులు గమనిస్తే నేను సాధించిన పరుగులు కనిపిస్తాయి. విమర్శల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సరిగా ఆడలేకపోవచ్చు. సారథ్యం మార్పు వల్లే అలా జరిగిందనుకోవడం సరికాదు. ఇంతకుముందు చెప్పినట్లుగా విరాటే మా నాయకుడు. జట్టులో రోహిత్ శర్మ ముఖ్యమైన ఆటగాడు. గతంలో ఎన్నోసార్లు టీమ్‌కు విజయాలు అందించాడు. అతడు క్రీజులో కుదురుకుంటే మ్యాచ్‌లు గెలిపిస్తాడు" అని రహానె వివరించాడు.
ఇదీ చదవండి: తెలంగాణ, ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ