ఓవల్ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ఇటీవలే జరిగింది. ఈ మ్యాచ్‌కు హిందీ కామెంటేటర్‌గా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్ జరుగుతున్న మధ్యలో మాట్లాడుతూ.. టీమ్ఇండియా ఓవల్ టెస్టు నెగ్గితే తాను కచ్చితంగా నాగిని డ్యాన్స్ వేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఆ టెస్టులో కోహ్లీసేన గెలుపొందింది. దీంతో కైఫ్ చెప్పిన మాట ప్రకారం నాగిని డ్యాన్స్ నేర్చుకొని కొన్ని స్టెప్పులు వేశాడు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఐపీఎల్లో రెండోదశ కోసం మహ్మద్ కైఫ్ దుబాయ్ చేరుకున్నాడు. అక్కడ దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మంగళవారం చేరాడు. మరికొన్ని రోజుల పాటు దుబాయ్ హోటల్ క్వారంటైన్లో గడపనున్నాడు కైఫ్.
ఇదీ చూడండి.. మైదానంలో రైనాను తిట్టిన ధోనీ.. కారణమేంటంటే?