ETV Bharat / sports

రోహిత్​ అర్ధసెంచరీ​​- లంచ్​ సమయానికి భారత్​ 106/3 - రెండో టెస్టు: తడబడుతోన్న భారత్​ ​​- లంచ్​ సమయానికి 106/3

ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో భారత్​ తడబడుతోంది. లంచ్​ సమయానికి కోహ్లీ సేన 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రోహిత్​ అర్ధసెంచరీతో అజేయంగా ఉన్నాడు.

lunch time in second test first innings
రెండో టెస్టు: తడబడుతోన్న భారత్​ ​​- లంచ్​ సమయానికి 106/3
author img

By

Published : Feb 13, 2021, 11:45 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ భోజన విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్​ శర్మ(80), రహానె(5) ఉన్నారు. రెండో వికెట్​కు 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది రోహిత్​, పుజారా జోడీ. ఈ జంట కుదురుకుంటున్న దశలో లీచ్​ దెబ్బతీశాడు.

రోహిత్​ ఒక్కడే..

ఓపెనర్​ రోహిత్​ ఎడాపెడా బౌండరీలు బాదుతూ వన్డే మ్యాచ్​ను తలపిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియాకు ఆదిలోనే షాక్​ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే రెండో ఓవర్​ మూడో బంతికే గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒల్లీ స్టోన్​ విసిరిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్​ కనీసం బ్యాట్​ అడ్డుపెట్టే ప్రయత్నమూ చేయలేదు.

పుజారా.. జాక్​ లీచ్​ బౌలింగ్​లో స్లిప్​లో దొరికిపోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ డకౌటయ్యాడు. అలీ బౌలింగ్​లో డిఫెన్స్​ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి టర్న్​ అయి వికెట్లను గిరాటేసింది. ఆశ్చర్యపోవడం విరాట్​ వంతైంది.

ఇదీ చదవండి: ఎదురుచూపులకు తెర.. స్టేడియం కళకళ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.