ETV Bharat / sports

తొలి టెస్టు: లంచ్​ సమయానికి 1/1తో ఇంగ్లాండ్​

author img

By

Published : Feb 8, 2021, 11:57 AM IST

చెన్నై టెస్టు నాలుగో రోజు మొదటి సెషన్​లో భారత్​ ఆలౌటైంది. తిరిగి రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​.. తొలి బంతికే రోరీ బర్న్స్​ వికెట్​ను కోల్పోయింది. భోజన విరామ సమయానికి పర్యాటక జట్టు 242 పరుగుల ఆధిక్యంలో ఉంది.

lunch time in first test
తొలి టెస్టు: 337 పరుగులకు భారత్​ ఆలౌట్​- 1/1తో ఇంగ్లాండ్​

తొలి టెస్టు నాలుగో రోజు తొలి సెషన్​లో ఓవర్​నైట్​ స్కోరు 257/6తో ఆటను కొనసాగించిన టీమ్​ఇండియా 337 పరుగులకు ఆలౌటైంది. మరో 21.5 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన భారత్​ మరో 80 పరుగులు చేసింది. చివరి నాలుగు వికెట్లలో లీచ్​, అండర్సన్​లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. వాషింగ్టన్​ సుందర్​ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇంగ్లాండ్​కు 241 పరుగుల మొదటి ఇన్నింగ్స్​ ఆధిక్యం లభించినప్పటికీ.. భారత్​ను ఫాలోఆన్​ ఆడించలేదు. అనంతరం రెండో ఇన్నింగ్స్​ను కొనసాగించిన పర్యాటక జట్టు రెండు ఓవర్లు ఆడి.. 1/1తో లంచ్​కు వెళ్లింది. బౌలింగ్​ను ఆరంభించిన స్పిన్నర్​ అశ్విన్​ తొలి బంతికే రోరీ బర్న్స్ వికెట్​ తీసుకున్నాడు.

ఇదీ చదవండి: తొలి ఇన్నింగ్స్​లో 337 పరుగులకు భారత్​ ఆలౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.