అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో (తుది) టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో బీసీసీఐ పోస్ట్ చేసింది. కెప్టెన్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ అజింక్య రహానె నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కోచ్ రవిశాస్త్రితో రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రణాళికల గురించి చర్చిస్తున్నాడు.
-
Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U
— BCCI (@BCCI) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U
— BCCI (@BCCI) March 1, 2021Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U
— BCCI (@BCCI) March 1, 2021
ప్రాక్టీస్‌లో భాగంగా వార్మప్ చేస్తున్న ఫొటోను వైస్ కెప్టెన్ అజింక్య రహానె ట్విట్టర్లో పంచుకున్నాడు. "చివరి మ్యాచ్ ఆడడానికి సమయం దగ్గర పడనున్న క్రమంలో పరిమితులకు మించి శ్రమించాల్సి ఉంది" అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు.
-
Stretching limits as we enter the last few days of training before the final test match pic.twitter.com/1FrTjPMG2r
— Ajinkya Rahane (@ajinkyarahane88) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stretching limits as we enter the last few days of training before the final test match pic.twitter.com/1FrTjPMG2r
— Ajinkya Rahane (@ajinkyarahane88) March 1, 2021Stretching limits as we enter the last few days of training before the final test match pic.twitter.com/1FrTjPMG2r
— Ajinkya Rahane (@ajinkyarahane88) March 1, 2021
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు అంచనాలను అందుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టెస్టులోనైనా సెంచరీ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. విరాట్ చివరిసారిగా 2019లో శతకం చేశాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. చివరి మ్యాచ్‌ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని యత్నిస్తోంది.
ఇదీ చూడండి: చివరి టెస్టు కోసం నెట్స్‌లో శ్రమిస్తున్న భారత్