మార్చి 4 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక టెస్టు కోసం టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. సోమవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు.. మంగళవారం ఫీల్డింగ్‌పై దృష్టి సారించారు. ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ నేతృత్వంలో సాగిన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది.
బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ డైవింగ్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్రోలో శిక్షణ తీసుకుంటున్నాడు. వీరితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ ఉమేశ్ యాదవ్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
-
Fielding drills ✅@Paytm #INDvENG pic.twitter.com/fAdEKZ2YYA
— BCCI (@BCCI) March 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fielding drills ✅@Paytm #INDvENG pic.twitter.com/fAdEKZ2YYA
— BCCI (@BCCI) March 2, 2021Fielding drills ✅@Paytm #INDvENG pic.twitter.com/fAdEKZ2YYA
— BCCI (@BCCI) March 2, 2021
అంతకుముందు కెప్టెన్ కోహ్లీ, రహానెతో పాటు మిగిలిన ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. ఆఖరి టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత పొందాలని పట్టుదలగా ఉంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టును ఓడించి కోహ్లీసేన టెస్టు ఛాంపియన్షిప్ ఆశలను నీరుగార్చాలని రూట్ సేన భావిస్తోంది.
ఇదీ చూడండి: నాలుగో టెస్టు ముందు పిచ్‌పై వాన్ వివాదాస్పద పోస్ట్